ప్రజా భద్రతే లక్ష్యంగా చేసుకుని సురక్షా కమిటీల ఏర్పాటు. ప్రజలలో సేఫ్టీ కల్చర్ తీసుకురావడమే ఈ సురక్షా కమిటీల యొక్క ముఖ్య ఉద్దేశం

5
0

ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, విజయవాడ తేదీ.22-01-2025.

ప్రజా భద్రతే లక్ష్యంగా చేసుకుని సురక్షా కమిటీల ఏర్పాటు.

ప్రజలలో సేఫ్టీ కల్చర్ తీసుకురావడమే ఈ సురక్షా కమిటీల యొక్క ముఖ్య ఉద్దేశం

.

ప్రతి పోలీస్ స్టేషన్ పరిదిలో ఒక సురక్షా కమిటీ చొప్పున ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనర్ రేట్ పరిదిలో 28 సురక్ష కమిటీల ఏర్పాటు.

నగరంలో మరో 1000 సి.సి.కెమెరాల ఏర్పాటుకు స్వచ్చందంగా ముందుకు వచ్చిన దాతలు.

సి.సి.కెమెరాల పర్యవేక్షణకు మరో 250 మంది ముందుకు వచ్చిన సేఫ్టీ అంబాసిడర్స్ కు ధన్యవాదాలు.. నగర పోలీస్ కమీషనర్  ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.

సురక్షా కమిటీలను, వెయ్యి సిసి కెమెరాలు, ఈగల్ వెహికల్స్ ను ప్రారంభించిన హోంమంత్రి వర్యులు   వంగలపూడి అనిత , రాష్ట్ర డి.జి.పి. ద్వారకాతిరుమల రావు ఐ.పి.ఎస్.

ఈ రోజు ఎ ప్లస్ ఫంక్షన్ హాల్ నందు పోలీసు కమిషనర్  ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ఆద్వర్యంలో ఎన్.టి.ఆర్.పోలీస్ కమీషనర్ రేట్ పోలీస్ స్టేషన్ పరిదిలో సురక్షా కమిటీల ప్రారంబోత్సవం మరియు దాతల సహకారంతో నగరంలో ఏర్పాటు చేసిన 1000 సి.సి.కెమెరాలను ఈ రోజు ప్రారంబించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా రాష్ట్ర హోంశాఖా మాత్యులు  వంగలపూడి అనితగారు, రాష్ట్ర డి.జి.పి.  సి.హెచ్ ద్వారకాతిరుమల రావు ఐ.పి.ఎస్., ఎన్.టి.ఆర్.జిల్లా ఎం.పి. కేశినేని శివనాద్ (చిన్ని , ఎం.ఎల్.ఏ.లు  యలమంచిలి సుజనా చౌదరి  బొండా ఉమా మహేశ్వర రావు గద్దె రామ్మోహన రావు  రాజగోపాల్ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ,  తంగిరాల సౌమ్య  కోటికలపూడి శ్రీనివాసరావు , మాజీ మంత్రివర్యులు  కామినేని శ్రీనివాస్ ,  జిల్లా కలెక్టర్  జి.లక్ష్మిశా ఐ.ఎ.ఎస్., తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నగర పోలీస్ కమీషనర్  మాట్లాడుతూ. ప్రజల పట్ల పూర్తి బాధ్యత తో పోలీసు శాఖ పని చేస్తుంది, ప్రజలకు ఎటువంటి కష్టం, ఇబ్బంది ఉన్నా స్పందించి ముందుకు వస్తాం, సి.పి.గా బాధ్యత లు తీసుకున్నాక కమాండ్ కంట్రోల్ రూమ్ పై దృష్టి పెట్టడం జరిగింది. సి.సి.కెమెరాలు పని చేయకపోవడం తో కంట్రోల్ రూమ్ వ్యవస్థ సరిగ్గా లేదని కెమెరాలు కొనుగోలు చేసి కంట్రోల్ రూమ్ వ్యవస్థ ను ఆధునీకరించాం, పోలీసు శాఖ లో సాంకేతిక పరికరాలను అందుబాటులోకి తెచ్చాం, 10 వేల‌ మీటర్ల రోప్ కొన్నాం,  1900 కెమెరాలను కంట్రోల్ రూం కు అనుసంధానం చేశాం, చేరువ, ఫాల్కాన్  వాహనాలను  ‌మళ్లీ ఉపయోగం లోకి తీసుకువచ్చం, సైబర్ క్రైం నేరాలు ఇటీవల కాలంలో బాగా పెరిగాయి, ఆన్ లైన్ మోసాల బారిన పడకుండా ఉండేలా ప్రజల్లో అవగాహన తెచ్చే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం,  ఏ తరహా మోసాలు ఎక్కువ జరుగుతున్నాయో గుర్తించి వాటిని‌ నియంత్రించే దిశగా చర్యలు చేపట్టాం, దీనిలో బాగంగా పలు అవగాహన కార్యక్రమాలతో పాటు బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి వారి సహకారంతో ప్రజలు సైబర్ నేరస్తుల బారిన పడి అధికమొత్తంలో నష్టపోకుండా నివారించడం జరిగింది. విజయవాడ లో వరదలు వచ్చిన సమయంలో పోలీసు శాఖ నిద్రహారాలు మాని విధులు నిర్వర్తించారు, మాకు ప్రజలంటే ఎంతో అభిమానం, ప్రాణం, ‌వారి కోసం వృత్తి పరంగా, వ్యక్తిగతంగా ఎన్నో సేవా కార్యక్రమాలను చేశాం, రాష్ట్ర ముఖ్యమంత్రి , డిజిపి  ఆదేశాలు, సూచనలతో ప్రజలకు ఇటువంటి సేవ  చేసేలా అవసరమైన సౌకర్యాలు కల్పించారు, దసరా ఉత్సవాలు సమయంలో లక్షల సంఖ్య లో వచ్చిన భక్తులు కు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా పోలీసులు ప్రణాళిక బద్దంగా పని చేశారు, మోడల్ గెస్ట్ హౌస్ లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేశాం, డ్రోన్ కెమెరా లు కొనుగోలు చేసి…‌వాటి ద్వారా ఎప్పట్టికప్పుడు రద్దీని పరిశీలించి తగిన చర్యలు తీసుకున్నాం, భవానీ దీక్ష ల విరమణ సమయంలో కూడా డ్రోన్ కెమెరా లు ద్వారా రద్దీని పరిశీలించి తగిన చర్యలు తీసుకున్నాం, దసరా ఉత్సవాలు సమయంలో జరిగిన చిన్న తప్పిదాలను సరి చేసి భవానీ దీక్ష ల్లో ప్రణాళికలు అమలు చేశాం ఈ నేపధ్యంలో ఎక్కడా ఎటువంటి చిన్న సంఘటనలు కూడా జరుగకుండా బందోబస్త్ నిర్వహించడం జరిగింది. ఎక్కడా లేని విధంగా ప్రతి పోలీస్టేషన్ కు డ్రోన్ కెమెరా లు కొనుగోలు చేశాం, దేశంలోనే ఎన్.టి.ఆర్ జిల్లా పోలీసు ఒక మైలు రాయిగా నిలబదేవిధంగా  క్లౌడ్ పెట్రోలింగ్ అనే కొత్త కాన్సెప్ట్ తో విజయవాడ నగర పోలీసు కమిషనరేట్ ముందుకు రావడం జరిగింది. మహిళా సచివాలయ పోలీసులకు అంధరికి డ్రోన్ పైలైటింగ్ పై శిక్షణ ఇవ్వడం జరిగింది. కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా మాకు సహకారం అందించారు, ఎక్కడ ఉన్నా ఫోన్ లో చూసి మానటరింగ్ చేసేలా సాంకేతికత ను వినియోగించుకున్నాం, మహిళా పోలీసులు బాగా పని చేస్తున్నారు… వారికి మా అభినందనలు ఈ క్రమంలో హెల్మెట్, సీటు బెల్ట్ వాడకం పై ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చాం, ఎనబై శాతం మంది లో మార్పు వచ్చింది, వంద శాతం ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా ప్రజలకు అవగాహన కల్పిస్తాం,  హైకోర్టు ఆదేశాలను అందరూ పాటించాలి, ట్రాఫిక్ మేనేజ్మెంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టి .. మార్పులు చేస్తున్నాం.

ప్రజల భద్రతను బలోపేతం చేయడం, ప్రజలలో విశ్వాసాన్ని పెంపొందించడం, మరియు ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించి శాంతి భద్రతలను పరిరక్షించడం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమీషనరేట్ పోలీస్ యొక్క ప్రధాన లక్ష్యం. ప్రజల మేలును ఎల్లప్పుడూ ప్రాధాన్యంగా తీసుకొని, సురక్షితమైన మరియు శాంతిమయమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడంలో ఎన్టీఆర్ పోలీస్ నిరంతరం కృషి చేస్తోంది.  

ఈ కృషిలో బాగంగా .1.⁠ ⁠E-Pahara, 2. Cyber citizens,  3.⁠ ⁠AsTram, 4. Victim compensation, 5. Cloud Petrols, 6. Traffic Ambassadors, 7. Falcon, 8. Cheruva, మొదలగు కార్యక్రమాలతో ప్రజలకు విశేష సేవలనిస్తుంది ఎన్.టి.ఆర్.పోలీస్ కమీషనరేట్.  

1.  “ఇ-పహారా” సాంప్రదాయ పోలీస్ బీట్ వ్యవస్థను ఆధునీకరించి, రియల్ టైమ్ మానిటరింగ్‌తో పారదర్శకత మరియు సమయస్ఫూర్తి ద్వారా ప్రజల భద్రతను మరింతగా మెరుగుపరిచింది.

2.⁠ ⁠*Cyber citizens:“Be a Cyber Citizen, Not a Cyber Crime Victim”* కార్యక్రమం ద్వారా 3 లక్షల మందికి సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. *“బ్యాంకర్స్ మీట్”* ద్వారా బ్యాంకర్లతో సమన్వయాన్ని పెంపొందించి, అనుమానాస్పద లావాదేవీలు నిలువరించారు. 

3.⁠ ⁠“అస్త్రం” అనేది ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి AI టూల్ ద్వారా డేటా ఆధారిత విశ్లేషణతో రోడ్డు భద్రతను మెరుగుపరుస్తూ, VIP కదలికలు మరియు లైన్ బ్రేకింగ్ వంటి సమస్యలను సమర్థవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించింది.

4.⁠ Victim Compensation: “Hit and Run” ప్రమాదాల విషయంలో, సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా 30 రోజుల లోపు పరిహారం అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. రెవెన్యూ మరియు పోలీసుల సమన్వయంతో బాధితులకు తక్షణ పరిహారాన్ని అందిస్తూ, వారికి ఆర్థిక భరోసాను కల్పిస్తున్నారు.

5.⁠ ⁠*“క్లౌడ్ పేట్రోల్స్”* ఆధునిక డ్రోన్ సాంకేతికతను వినియోగించి, డ్రగ్స్ నియంత్రణ, రిస్క్ ప్రాంతాల పర్యవేక్షణ, మరియు ఆటోమేటిక్ డ్రోన్ సర్వైలెన్స్ ద్వారా భద్రతా చర్యలను వేగవంతం చేస్తున్నారు.

6.⁠ Traffic Ambassadors*: రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు విజయవాడ సిటీ పోలీసులు సుమారు 380 మంది వాలంటీర్లను ట్రాఫిక్ అంబాసిడర్లగా నియమించి. వీరి సహాయంతో ట్రాఫిక్ సమస్యలను గుర్తించి, విశ్లేషించి, ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ విధానం వాహన రవాణాను సాఫీగా నిర్వహించడంలో మరియు రోడ్డు భద్రతను మెరుగుపరచడంలో సహాయపడుతోంది.

7.⁠ Falcon:పెద్ద పెద్ద సమావేశాలు, సదస్సులు జరిగే సమయంలో భద్రత దృష్ట్యా సిబ్బందిని సమన్వయం చేసి నిర్వహించే వ్యవస్థ కమాండ్ అండ్ కంట్రోల్ తో అనుసంధానమై పని చేస్తుంది.

8.⁠ ⁠Cheruva: మొబైల్ డిజిటల్ స్క్రీన్ ద్వారా ప్రజల్లో Good & Bad Touch, Cyber crime awareness  గంజా మరియు మాదక ద్రవ్యాల వ్యతిరేకత పై అవగాహన కల్పిస్తున్నారు.

ఇప్పుడు..   “సురక్షా”  అనే పేరుతో,  ఫర్ సేఫ్ నెయిబర్‌హుడ్ అనే కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమం NTR పోలీస్ కమిషనరేట్‌ ఆవిష్కరించింది.

ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన 20 మంది సభ్యులతో సురక్ష కమిటీ ఏర్పాటు చేసి, అందులో.. ఉపాధ్యాయులు, వైద్యులు, మైనారిటీ ప్రతినిధులు, న్యాయవాదులు వంటి ప్రముఖులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ప్రధానంగా ప్రజలు మరియు పోలీసుల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. స్మార్ట్ పోలీసింగ్ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం దీని ముఖ్య లక్ష్యం. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన కల్పించడం, బలహీన వర్గాల భద్రతపై దృష్టి పెట్టడం కమిటీ కర్తవ్యాల్లో ఒక భాగం. ఇక డ్రోన్లు, సీసీటీవీ నిర్వహణ మరియు ట్రాఫిక్ నియంత్రణలో ఈ కమిటీ కీలకంగా పనిచేస్తుంది.  ఈ విధంగా విజయవాడ పోలీసులు శాంతి, భద్రత, మరియు సురక్షిత సమాజం కోసం అంకితభావంతో ముందడుగు వేస్తున్నారు.

అనంతరం సురక్షా కమిటీలను ప్రారంబించడం జరిగింది.  సురక్ష కోర్ కమిటీ సభ్యులను అభినందించి   ప్రమాణం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ప్రతిజ్ఞ మేము భద్రత, రక్షణ, మరియు సమాజ శ్రేయస్సు కోసం సమర్థవంతంగా పని చేయాలని ప్రతిజ్ఞ చేస్తున్నాము.నేరాలు నివారించేందుకు, అవగాహన పెంపొందించేందుకు, మరియు చట్టం అమలు చేయడంలో మద్దతు ఇస్తాము. ప్రతి వ్యక్తి హక్కులను గౌరవిస్తూ, గోప్యతను  కాపాడుతాము  సమాజం లో   భద్రతా సంస్కృతి ని పెంపొందించడానికి కృషి చేస్తాము.

అనంతరం 1000 సి.సి.కెమెరాలను మరియు ఈగల్ వాహనాలను ప్రారంబించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎం.ఎల్.ఏ.గార్లు మాట్లాడుతూ….  ముందుగా ఈ కార్యక్రమంలో పాల్గోవడం చాల ఆనందంగా ఉందని, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు  ఉత్తమ పోలీసింగ్ ఇవ్వడానికి విశేషంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. శాసన వ్యవస్థ, పోలీసు వ్యవస్థ కలసి పనిచేస్తే ఏ విధంగా ఉంటుందో అని చెప్పడానికి విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఒక నిదర్శనం అన్నారు. ట్రాఫిక్ విషయంలో కూడా మెరుగైన చర్యలతో ట్రాఫిక్ జామ్ కాకుండా, జంక్షన్ల క్రాసింగ్ల వద్ద ఎక్కువ సమయం పట్టకుండా చర్యలు తీసుకున్నారన్నారు. అలాగే విస్తృతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు ద్వారా నేరాల నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. కూటమి ప్రభుత్వం నేరాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుదన్నారు.

ఎం.పి. శ్రీ కేశినేని శివనాద్ (చిన్ని)  మాట్లాడుతూ…పోలీసు వ్యవస్థ లో ఎన్నో మార్పులు వచ్చాయి, సిసి కెమెరా లు, డ్రోన్ కెమెరా ల ద్వారా సాంకేతికతను ఎన్.టి.ఆర్.  జిల్లా పోలీసులు వినియోగించుకుంటున్నారు, ప్రజాప్రతినిధులు గా మా వంతు సహకారం కూడా అందించాం, విజయవాడ లో విఐపి ల తాకిడి చాలా ఎక్కువ, ట్రాఫిక్, కూడా ఎక్కువ ఉన్నందున పోలీసు  సిబ్బంది పై పని ఒత్తిడి బాగా ఉంది,అదనంగా పోలీసు సిబ్బంది ని ఇక్కడ నియమించాలి, ప్రజలు కూడా పోలీసులు కు మంచి సహకారం అందిస్తున్నారు, ప్రజల కోసం నిరంతరం పని చేసే పోలీసులు కు మా సహకారం ఎప్పుడూ ఉంటుంది, కూటమి ప్రభుత్వం లో మంచి పోలీసింగ్ ప్రజలకు అందుతుంది అని తెలియజేశారు.

రాష్ట్ర డి.జి.పి.  సి.హెచ్. ద్వారకా తిరుమలరావు ఐ.పి.ఎస్. మాట్లాడుతూ సిసి కెమెరా ల ద్వారా నేరాలను నియంత్రణ జరుగుతుంది, మార్చి నెలాఖరు నాటికి రాష్ట్రం మొత్తం మీద లక్ష కెమెరాలు పెట్టబోతున్నాం, సురక్ష కమిటీ ల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తున్నాం,డ్రోన్ కెమెరా ల కొనుగోలుకు ప్రజాప్రతినిధులు సహకారం అందించారు, కాలానుగుణంగా పోలీసింగ్ లో కూడా మార్పులు రావాలి, ప్రజల్లో పోలీసులు పని తీరు కనిపించాలి,  విజిబుల్ పోలీసింగ్ – ఇన్ విజిబుల్ పోలిసింగ్ (ప్రజలకు పోలిసింగ్ కనిపించాలి కానీ పోలీసులు కనిపించకూడదు) అని సి.ఎం  ఎప్పుడూ చెబుతుంటారు,  సాంకేతికత ను వాడుకోవడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి, పోలీసుల్లో నాలెడ్జ్, ఆలోచన, పని తీరు మారాలి, డ్రోన్, కెమెరా ల ద్వారా ఇప్పటికే మంచి ఫలితాలు సాధించాం, సైబర్ క్రైం, మాదక ద్రవ్యాల రవాణాను చాలా వరకు అరి కట్టగలిగాం, మా వ్యవస్థ లను  మరింత బలోపేతం చేసి నేరాలను నియంత్రిస్తాం అని తెలియజేశారు.

రాష్ట్ర హోంశాఖా మాత్యులు  వంగలపూడి అనితగారు మాట్లాడుతూ.ప్రతి పోలీస్టేషన్  పరిధిలో ఏర్పాటు చేసిన  సురక్ష కమిటీ లను  ప్రారంభించడం సంతోషంగా ఉంది, పోలీసులు పని తీరు, సాధించిన ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయి, ఎన్.టి.ఆర్. జిల్లా పోలీసులు సాంకేతికత ద్వారా మంచి ఫలితాలు సాధించారు, ఎన్.టి.ఆర్. జిల్లాలో ఉన్న ఎంపి, ఏడుగురు ఎమ్మెల్యే లు ఇంతసేపు ఇక్కడ ఉండటం ఆనందం‌ కలిగించింది, పోలీస్ కమీషనర్  ఎస్.వి.రాజ శేఖర బాబు పని తీరు ఆదర్శంగా నిలుస్తుంది, గతంలో  పోలీసు అంటే కటువుగా ఉంటారు,  అమ్మో‌ పోలీస్ అనే పరిస్థితి ఉండేది, ఇప్పుడు అంతా మారింది ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు మంచి సేవలు అందిస్తున్నారు, డిజిపి ముందు‌చూపు, సూచనలు పాటించి బెజవాడ పోలీసులు ప్రజల మన్ననలు పొందారు, దసరా, భవానీ దీక్ష ల విరమణ సమయంలో లక్షల మంది భక్తులు వచ్చినా ఎవరికీ ఇబ్బంది లేకుండా బందోబస్త్ నిర్వహించి పోలీసులు పని తీరు భేష్ అనిపించేలా చేశారు, పోలీసు శాఖ కు డ్రోన్ కెమెరాలు ఇచ్చిన ప్రజాప్రతినిధులుకు  నాధన్యవాదాలు, ఎప్పటికప్పుడు లోపాలను సవరించుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఒక వైపు డ్రోన్ లు, మరోవైపు సిసి కెమెరా ల ద్వారా నిందితుల కదలికల‌పై నిఘా పెట్టారు, ఎక్కడా ట్రాఫిక్ ఆగకుండా ఎప్పటికప్పుడు పరిశీలన చేసి చర్యలు తీసుకుంటున్నారు, విజయవాడ వరదల సమయంలో పోలీసులు పని తీరుతో ప్రజల మన్ననలు పొందారు, ప్రజలు కూడా పోలీసులు తీసుకునే నిర్ణయాలకు స్వాగతం పలుకుతూ సహకారం అందిస్తున్నారు, ఇప్పుడు సాంకేతికత ను ఉపయోగించుకుని పోలీసులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు, టెక్నాలజీ పేరు చెబితే గుర్తు వచ్చే మొదటి పేరు సిఎం నారా చంద్రబాబు నాయుడు, ఒక్క డ్రోన్ నేడు వంద మందితో సమానంగా పని చేస్తుంది, డ్రోన్ కల్చర్ ద్వారా అనేక ఫలితాలు సాధిస్తున్నారు, తప్పు చేసిన వ్యక్తి తప్పించుకోకూడదు అన్న చంద్రబాబు మాటలను ఆచరించేలా పోలీసులు పని చేస్తున్నారు, రాష్ట్రం లో మాదక ద్రవ్యాలు రవాణా పూర్తిగా నిరోధిస్తాం, ప్రజల భద్రత కోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్లను బాగా ప్రచారం చేయాలి, ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే ఆ నెంబర్ లకు కాల్  చేసేలా ఉండాలి, కూటమి ప్రభుత్వం లో మంచి పోలీసింగ్ ద్వారా ప్రజలు ఒక ధైర్యం తో ఉన్నారు అని తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here