ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 18 ఫిర్యాదులు

Spread the love

 విజయవాడ నగరపాలక సంస్థ 

19-08-2024

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 18 ఫిర్యాదులు

 విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

 విజయవాడ నగరపాలక సంస్థ ప్రథమ కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో సోమవారం  జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 18 ఫిర్యాదులు అందినట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. 

 ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ  వచ్చిన ప్రతి ఫిర్యాదును శఖాధిపతులు స్వయంగా ఫీల్డ్ కి వెళ్లి సమస్యను పరిష్కరిస్తున్నారని, ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో దరఖాస్తు చేస్తున్నామని, సంతృప్తికరమైన పరిష్కారం ఇచ్చిన తర్వాతే ఆ ఫిర్యాదును ఆన్లైన్లో  క్లోజ్ చేస్తున్నామని తెలిపారు. 

 ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అనధికార ఆక్రమణలు, వాటర్ పైప్లైన్ మరమతులు, అనధికార  పార్కింగ్ ఫీజు వసూలు, ట్రాఫిక్ నియంత్రణకు స్పీడ్ బ్రేకర్లు, బారి గేట్లు, ట్రాఫిక్ ఇండికేటర్ల ఏర్పాటు, ఓపెన్ డ్రైన్, సెల్ టవర్ నిర్మాణానికి అభ్యంతరం, వీధి దీపాల సమస్య, వీధి కుక్కల సమస్య, మంచినీటి మరమ్మతుల కొరకు తవ్విన రోడ్లను పూడ్చుట, అనధికార కట్టడాలు, ఖాళీ స్థలంపై పన్ను వంటి సమస్యలపై ఫిర్యాదులు అందుకని సత్వర సంతృప్తికరమైన పరిష్కారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. 

 ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అత్యధికంగా పట్టణ ప్రణాళిక  విభాగానికి సంబంధించిన 9 ఫిర్యాదులు, ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించినవి నాలుగు, పన్ను సంబంధించినవి రెండు, ప్రజారోగ్యం, ఎస్టేట్ విభాగం, వెటర్నరీ విభాగానికి సంబంధించిన ఒక ఫిర్యాదు అందుకున్నారు. 

 ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతోపాటు అడిషనల్ కమిషనర్ (జనరల్ )డాక్టర్ ఏ.మహేష్, అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి . సత్యవతి, చీఫ్ ఇంజనీర్ ఇంచార్జ్ శ్రీరామచంద్రమూర్తి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ పి. రత్నవళి, జాయింట్ డైరెక్టర్ అమృత్ డాక్టర్ లత, ఎస్టేట్ ఆఫీసర్ టి.శ్రీనివాసరావు, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్,డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబోస్,  వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి.సోమశేఖర్ రెడ్డి, బయాలజిస్ట్  సూర్యకుమార్   పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *