ప్రజా ప్రభుత్వంలో ప్రజల ఆరోగ్యానికే తొలి ప్రాధాన్యత : ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) యాంటీ లార్వా ఆపరేషన్ పనులు ప‌రిశీల‌న‌

Spread the love

 16-08-2024

ప్రజా ప్రభుత్వంలో ప్రజల ఆరోగ్యానికే తొలి ప్రాధాన్యత : ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) 

యాంటీ లార్వా ఆపరేషన్ పనులు ప‌రిశీల‌న‌

విజ‌య‌వాడ : రాష్ట్రంలో దోమల నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా మలేరియా కేసులు తగ్గుముఖం పట్టాయి.. ప్రజా ప్రభుత్వంలో ప్రజల ఆరోగ్యానికే మొదటి ప్రాధాన్యత ఉంటుందని ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) అన్నారు. సెంట్ర‌ల్ నియోజ‌వ‌ర్గం అయోధ్య‌న‌గ‌ర్ లోని బుడ‌మేర వంతెన ద‌గ్గ‌ర వి.ఎం.సి నిర్వ‌హిస్తున్న యాంటీ లార్వా ఆపరేషన్ పనులను శుక్ర‌వారం ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు తో క‌లిసి ఎంపి కేశినేని శివ‌నాథ్ ప‌రిశీలించారు. 

ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ మురుగు కాల్వ‌ల్లో దోమలు పెట్టే లార్వాను డ్రోన్స్ సహాయంతో గుర్తించి వాటిని నివారించేందుకు డ్రోన్స్ ద్వార‌నే కెమికల్స్ స్ప్రేయింగ్ చేయిస్తున్న‌ట్లు తెలిపారు. . దోమ‌ల కార‌ణంగా మ‌లేరియా తో పాటు వైర‌ల్ జ్వ‌రాలు విజృంభించకుండా రాష్ట్ర ప్ర‌భుత్వం గ‌త రెండు నెల‌ల నుంచి రాష్ట్రంలో దోమ‌ల నివార‌ణ చ‌ర్య‌లు చేపట్టింద‌న్నారు. 

 ఈ కార్య‌క్ర‌మంలో మెడిక‌ల్ ఆఫీస‌ర్ ర‌త్నావ‌ళి, బ‌యాలాజిస్ట్ సూర్య‌, జోనల్ క‌మిష‌న‌ర్ కె.ప్ర‌భుదాస్ ల‌తో పాటు కార్పొరేష‌న్ సిబ్బంది పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *