ప్రజాస్వామ్యక శాస్త్రీయ భాషా విధానం కావాలి…రౌండ్ టేబుల్

5
0

 ప్రజాస్వామ్యక శాస్త్రీయ  భాషా విధానం కావాలి…రౌండ్ టేబుల్

 ఆ,యా రాష్ట్ర ప్రజల అవసరాలకు తగినట్లుగా ప్రజాస్వాంక పద్ధతిలో భాషలు నేర్చుకునేటటువంటి అవకాశాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలని, అలా కాకుండా త్రిభాషా సూత్రానికి కచ్చితంగా అమలు చేస్తేనే నిధులు ఇస్తామని చెప్పడం సరికాదని  మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం తెలిపారు.

ఈరోజు  విజయవాడ యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో  జాతీయ విద్యావిధానం-భాషావిధానం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది… ఈ సమావేశంలో పాల్గొన్న V. బాలసుబ్రహ్మణ్యం  మాట్లాడుతూ మాతృభాషలో పట్టు లేకుండా దేశ అభివృద్ధి చెందడం సాధ్యం కాదని తెలిపారు. జాతీయ విద్యా విధానం కూడా 8వ తరగతి వరకు మాతృభాషలోనే 

బోధన ఉండాలని చెప్పిందని, దీనిని అమలు కోసం కేంద్ర ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు .ఏ రాష్ట్రానికి ఏ అవసరం ఉందో పిల్లలు నేర్చుకునే సామర్ధ్యం ఆధారంగా పిల్లలు  భాషను నేర్చుకుంటారని తెలిపారు. ఇలా కాకుండా బలంతాన  ఫలానా భాష నేర్చుకోవాలని నిద్దేశించటం సరికాదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు త్రిభాషా సూత్రం అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నయా లేదో చెక్ చేయాలని, చాలా రాష్ట్రాలు ద్విభాష  విధానం ని అమలు చేస్తున్నారు. భారతదేశంలో 27 భాషలు అధికారికంగా  గుర్తించిందని , భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంలో ఒక ప్రత్యేక భాష దేశం మొత్తం నేర్చుకోవాలని చెప్పడం తగదు అని చెప్పారు. భాషలు పేరుతో నిధులు ఆపడం సరికాదని తెలిపారు.

కార్పొరేట్ విద్యా విధానం  వచ్చిన తర్వాత  అసలు ఏ భాషా విద్యా విధానం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు . కార్పొరేట్ ఏర్పడిన తర్వాత ఈ భాషా విధానాలు ఏమవుతుందని ఆందోళన గురవుతుందని చెప్పారు. కార్పొరేట్ విద్యావిధానం ని నియంత్రించే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏదైనా రాజ్యాంగం నిర్దేశించిన ఫెడరల్ స్ఫూర్తి ని అమలు చేయాలని కోరారు.భాషలు అమలు కు రాష్ట్రాలకు  స్వేచ్ఛ ఇవ్వాలని, ఆ భాష కూడా శాస్త్రీయమైన భాషగా ఉండాలని, ప్రజాస్వామ్యక విలువల్ని, రాజ్యాంగ విలువల్ని రక్షించే విధంగా  విద్యారంగం లో మార్పులు తీసుకురావడానికి కృషి చేయాలని   కోరారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన  వక్తలు  శాస్త్రీయ భాషా విధానాన్ని రక్షించుకోవడం కోసం ఒక ఐక్య వేదికను ఏర్పాటు చేసుకోవాలని  కోరారు. 

పిల్లలకు కావలసిన విద్యా విధానాన్ని అమలు చేసుకునే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా ఈ వేదిక కృషి చేయాలని కోరారు.

 ఈ రౌండ్ టేబుల్ సమావేశం లో యూటీఎఫ్ రాష్ట్ర  అధ్యక్షులు N. వెంకటేశ్వర్లు, ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.  చిరంజీవి, కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్రా మాల్యాద్రి, జె వి వి రాష్ట్ర నాయకులు  K.  శ్రీనివాస్ ,యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి  ఎస్పీ. మనోహర్ కుమార్, ప్రచురణల విభాగం చైర్మన్  ఎం. హనుమంతరావు, 1938 నాయకులు బెంజిమన్  తదితరులు పాల్గొన్నారు.

ఈ రౌండ్ టేబుల్ ” రాష్ట్రాలకు స్వేచ్ఛ నిస్తూ ఆ, యా రాష్ట్రాల ప్రజల అవసరాలకు తగ్గట్టుగా భాషలు నేర్చుకునే అవకాశం ఉండాలని” తీర్మానం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here