ప్రజారోగ్య సంరక్షణే ధ్యేయం .
మెగా మెడికల్ క్యాంప్ ప్రారంభోత్సవంలో
ఎమ్మెల్యే సుజనా చౌదరి
ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ఉచిత మెగా వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు
డాక్టర్స్ డే సందర్భంగా మంగళవారం రౌండ్ టేబుల్ ఇండియా, రోటరీక్లబ్ , లేడీస్ సర్కిల్, మరియు సుజనా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపును నిర్వహించారు.
ఎమ్మెల్యే సుజనా చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొని క్యాంపును ప్రారంభించారు.
ముందుగా
ప్రజల ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న వైద్యులందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
పేదలకు లబ్ధి చేకూరేలా ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ పథకాల ద్వారా కూటమి ప్రభుత్వం సేవలందిస్తుందన్నారు.
వైద్యులు నూతన టెక్నాలజీని అందిపుచ్చుకొని ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా మెరుగైన ఆరోగ్య ఫలితాలను సాధించాలన్నారు.
సమాజ సేవలో భాగస్వామ్యులై సేవలందిస్తున్న వైద్యులను సత్కరించి, అభినందించారు.
కంటి పరీక్షల తో పాటు ఉచితంగా కేటరాక్ట్ ఆపరేషన్లు చేసేందుకు ముందుకు వచ్చిన శంకర కంటి ఆసుపత్రి వైద్యులను ప్రత్యేకంగా అభినందించారు..
ఎన్నికల వరకే పార్టీలు , ప్రత్యర్ధులని తరువాత అందరం ఒకటేనన్నారు.
ఆరోగ్య సంరక్షణలో ముందస్తు రోగ నిర్ధారణ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి
సుజనా ఫౌండేషన్ ద్వారా
రాజకీయాలకతీతంగా, పార్టీలకతీతంగా, ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ఏర్పాటు చేస్తున్న వైద్య శిబిరాలను ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తనకి ఓటు వేయని వారికి కూడా సంక్షేమాన్ని అందించేలా నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు.
రాబోయే రోజుల్లో తన సేవలను మరింత ఉధృతం చేస్తానని సుజనా హామీ ఇచ్చారు.
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి
ఎమ్ ఎస్ బేగ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సుజనా చౌదరి రాజకీయాలకతీతంగా సేవలందిస్తూ పేదలకు భారమైన విద్య,వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.
సుజనా ఫౌండేషన్ ద్వారా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారని అన్నారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ రౌండ్ టేబుల్ చైర్మన్ కాట్రగడ్డ మోహన్, లేడీస్ సర్కిల్ చైర్ పర్సన్ అలేఖ్య, అమరావతి రౌండ్ టేబుల్ చైర్మన్ సందీప్, లేడీస్ సర్కిల్ చైర్ పర్సన్ సింధు అందలం, రోటరీ క్లబ్ ఆఫ్ అమరావతి అధ్యక్షులు డాక్టర్ ప్రఫుల్, రౌండ్ టేబుల్ ఏపీ, తెలంగాణా చాప్టర్ అధ్యక్షులు కౌశిక్ యక్కల , డాక్టర్లు ఆదిత్య ,హర్ష, మానస, అమూల్య, సుజనా ఫౌండేషన్ హెల్త్ కోఆర్డినేటర్ బొమ్మ కంటి వెంకట రమణ, కూటమి నేతలు ఎమ్మెస్ బేగ్, బీజేపీ నాయకులు పైలా సోమినాయుడు, తదితరులు పాల్గొన్నారు.