ప్రజారోగ్యమే లక్ష్యంగా “సుజనా ఫౌండేషన్ “ఉచిత వైద్య శిబిరాలు ..

Spread the love

ప్రజారోగ్యమే లక్ష్యంగా “సుజనా ఫౌండేషన్ “ఉచిత వైద్య శిబిరాలు ..

పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్న ఆలోచనతో ప్రజల ఆరోగ్యాలను కాపాడటమే లక్ష్యంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి “సుజనా ఫౌండేషన్ “ద్వారా పశ్చిమలో విడతల వారిగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు..

“సుజనా ఫౌండేషన్” ,రౌండ్ టేబుల్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో శనివారం, భవానిపురం, గుప్తా సెంటర్ షాది ఖానా లో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు , పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ,
39 వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర రాఘవ,39 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కే శివ శర్మ, రౌండ్ టేబుల్ ఇండియా చైర్మన్ కాట్రగడ్డ మోహన్, రౌండ్ టేబుల్ ఇండియా లేడీస్ సర్కిల్ చైర్మన్ అలేఖ్య కలిసి ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు..

ఈ వైద్య శిబిరంలో జనరల్ చెకప్, ఆర్థోపెడిక్ , డెంటల్, గైనకాలజీ , గుండె, నెఫ్రాలజీ, క్యాన్సర్ స్క్రీనింగ్, కంటి వైద్య పరీక్షలు,ఆప్తమాలజీ వంటి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు..

మధ్యాహ్నం వరకు నిర్వహించిన ఈ శిబిరంలో సుమారు 500 మందికి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేశారు

స్వయం సహాయక సంఘాల మహిళలు, స్తానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

బీజేపీ కార్పొరేటర్ నరేంద్ర రాఘవ మాట్లాడుతూ ఎమ్మెల్యే సుజనా చౌదరి సమాజ ఆరోగ్య పరిరక్షణ, ప్రజారోగ్యమే లక్ష్యంగా సుజనా ఫౌండేషన్ చొరవతో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు

ఆర్థిక స్తోమత లేని పేదలకు ఉచిత వైద్య సేవలు ఎంతోగానో మేలు చేస్తాయని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు..

ఒమేగా అను మై బేబీ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ మౌనిక మాట్లాడుతూ సుజనా ఫౌండేషన్ , రౌండ్ టేబుల్ ఇండియా వారు పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం సంతోషకరమన్నారు.

స్వయం సహాయక సంఘాల మహిళలందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించామని తెలిపారు..

ముందస్తు రోగ నిర్ధారణ ద్వారా క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చని
ఎనికేపాడు లోని ఒమేగా అను మై బేబీ హాస్పిటల్ లో యాభై శాతం రాయితీతో కూడిన వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నామన్నారు

స్వయం సహాయక సంఘాల మహిళలు, పశ్చిమ ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా సుజనా ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు..

ఈ శిబిరంలో ఆంధ్ర హాస్పిటల్ అడ్మిన్ డైరెక్టర్ కామినేని అచ్యుత బాబు, ఒమేగా అను మై బేబీ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ మౌనిక, బెస్ట్ హాస్పిటల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ బీ శ్రీతేజ, బెస్ట్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ డాక్టర్ సంతోష్,శంకర నేత్ర వైద్యశాల గ్లోకోమా స్పెషలిస్ట్ డాక్టర్ సిద్ధార్థ అశ్విని, క్యాంప్ ఆర్గనైజర్ అమర్ల పూడి రవికాంత్,
గార్లపాటి అడ్వాన్స్ డెంటల్ క్లినిక్ డాక్టర్ నితీష్ గార్లపాటి, పిళ్ళైయార్ ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ సత్య ప్రశాంత్ , బెస్ట్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ పూజిత ఈ వైద్య శిబిరంలో తమ సేవలు అందించారు..

కూటమి నేతలు కండవెల్లి సాంబశివరావు, నక్కా కృష్ణ, రౌండ్ టేబుల్ ఇండియా మెంబర్స్ డాక్టర్ ఆదిత్య, రోణిన్ , మౌనీ , సుజనా మిత్రా కోఆర్డినేటర్లు హైమావతి, నర్మదా తదితరులు పాల్గొన్నారు..

Loading