ప్రజల హృదయాల్లో జగనన్నకు సుస్థిర స్థానం. మోసపూరిత హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో.

Spread the love

 ప్రజల హృదయాల్లో జగనన్నకు సుస్థిర స్థానం.

మోసపూరిత హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో.

ఎన్నికల్లో టిడిపి జనసేనకు ఓటమి ఖాయం. మోసపూరిత హామీలు, అబద్దాలతో గద్దెనెక్కెందుకు కుతంత్రాలు చేస్తున్న చంద్రబాబు, జనసేనకు ఈ ఎన్నికల్లో ఓటమి ఖాయమని ప్రభుత్వవిప్, సామినేని ఉదయభాను అన్నారు.

జగ్గయ్యపేట పట్టణం, మార్కండేయ బజారు, బంగారు పేట, చెరువు బజార్ తదితర ప్రాంతాలలో ప్రభుత్వవిప్, శాసనసభ్యులు సామినేని ఉదయభాను ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమాన్ని వివరిస్తూ, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని తెలియపరుస్తూ మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు.

ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ ఆర్థికంగా కష్టాలు ఎదురైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ప్రతి ఒక్కరూ హృదయాల్లో సుస్థిర స్థానాన్ని పొందారన్నారు. చంద్రబాబు అబద్ధపు హామీలను నమ్మి ప్రజలందరూ మోసపోవద్దని చెప్పారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి గెలుపు ఖాయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *