ప్రజల సమస్యలు పరిష్కారంపై అధికారులు దృష్టి పెట్టాలి:గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
నందివాడ మండల అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే
సమస్యల పరిష్కరించడం పై నిర్లక్ష్యం వద్దు…
ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తే సహించేది లేదు…
నందివాడ జులై 15: ప్రజల సమస్యలను పరిష్కరించడం పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సూచించారు. ప్రజలను ఇబ్బందులు పాలు చేసేలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు.
మండల కేంద్రమైన నందివాడ మండల పరిషత్ కార్యాలయంలో ప్రజల సమస్యలపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఎమ్మెల్యే రాము రివ్యూ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న అధికారులకు సమస్యల పరిష్కారం పై ఎమ్మెల్యే రాము పలు సూచనలు చేశారు.
అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ప్రస్తుత వ్యవసాయ సీజన్ దృష్టిలో ఉంచుకొని రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సక్రమంగా సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. భారీ వర్షాలు వచ్చినప్పుడు విద్యుత్ సమస్యలు తలెత్తకుండా, మరియు అంటూ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలపై అధికారులకు స్పష్టమైన సూచనలు చేసినట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు. ప్రజా శ్రేయస్సే సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేయాలని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు.
ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవి,మండల టిడిపి అధ్యక్షులు దానేటి సన్యాసిరావు, టిడిపి నాయకులు చేకూరు జగన్ మోహన్ రావు, ఎండిఓ మల్లీశ్వరి, తాసిల్దార్ గురుమూర్తి రెడ్డి,రెవెన్యూ, మండల పరిషత్, పంచాయతీరాజ్, ఇరిగేషన్, వ్యవసాయ శాఖ, విద్యుత్, ఆరోగ్యశాఖ, తదితర ప్రభుత్వ శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.