ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, విజయవాడ.
తేదీ.24-06-2025.
ప్రజల భద్రతే లక్ష్యంగా అధనంగా పటమట పోలీసు స్టేషన్ పరిదిలోని 9 కాలనీలలో నూతన సి.సి.కెమెరాలు ఏర్పాటు.
నూతన సి.సి.కెమెరాలను రిమోట్ ద్వారా ప్రారంభించిన ఎం.పి. కేశినేని శివనాద్ ( చిన్ని) ఎం.ఎల్.ఏ. గద్దె రామమోహన్ పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.
సి.సి.కెమెరాల ఏర్పాటుకు స్వచ్చందంగా ముందుకు వచ్చిన దాతలకు ధన్యవాధాలు. ….. నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.
ఈ రోజు NAC కళ్యాణ మండపం హాల్ నందు పటమట పోలీసు స్టేషన్ పరిదిలోని సి.టి.ఓ.కాలనీ, కనకదుర్గా నగర్, రామచంద్ర నగర్, సుబ్బారావు కాలనీ, కామినేని నగర్, నాగార్జున నగర్, భారతి నగర్, గణేష్ నగర్, కరెన్సీ నగర్ మొదలగు 9 కాలనీలలో నూతనంగా ఏర్పాటు చేసిన సి.సి.కెమెరాలను ప్రారంబించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ ఎన్.టి.ఆర్.జిల్లా ఎం.పి. శ్రీ కేశినేని శివనాద్ (చిన్ని) గారు, ఎం.ఎల్.ఏ. గద్దె రామ్మోహన రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ.కాలనీల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉంది, నేరాలను నియంత్రణ కు, గుర్తింపు కు సిసి కెమెరాలు అవసరం చాలా ఉంది, ఇప్పటి వరకు ఎన్.టి.ఆర్. జిల్లాలో దాతల సహకారంతో 4500 కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. 2014-2019 కాలం లో నగరంలో ఏర్పాటు చేసిన 1900 సిసికెమెరాల గత ఐదు సంవత్సరాలలో సరైన నిర్వహణ లేకపోవడంతో వాటిని పునరుద్దరించాము. సిసి కెమెరాలు ఏర్పాటు వల్ల నేరాలు తగ్గాయి, రోడ్డు ప్రమాదాలు తగ్గాయి, ఇది గణాంకాలే చెబుతున్నాయి.. ఎవరైనా పరిశీలన చేయవచ్చు, అక్టోబర్ నెలలో అస్త్రం టూల్ ను ప్రవేశ పెట్టాం కమిషనర్ రేట్ పరిదిలో 83 జంక్షన్ లు ఉన్నాయి, రియల్ టైమ్ లో ఎన్ని వాహనాలు వెళుతున్నాయో నిర్ధారణ చేస్తుంది, ట్రాఫిక్ రద్దీ ని చాలా వరకు తగ్గించాం, ప్రతి ఫంక్షన్ సమాచారం పోలీసులు కు ఇవ్వాలి, ఎంతమంది వస్తారు, ఎన్నికార్లు వచ్చే అవకాశం ఉందో చెప్పాలి, .అప్పుడు పోలీసు పరంగా కూడా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటారు, యేడాది క్రితం ట్రాఫిక్ కు, ఇప్పుడు ట్రాఫిక్ కు తేడా చూడండి, బైక్ దొంగతనాలు, చైన్ స్నాచింగ్ లు చాలా తగ్గాయి, సిసి కెమెరాలు ద్వారా దొంగలను పట్టుకున్నాం, టెక్నాలజీ ని సరిగా వినియోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి, దొంగతనాల సొమ్ము రికవరీ శాతం కూడా పెరిగింది. ఎమ్మెల్యే, ఎంపి లు కూడా డ్రోన్ లు విరాళంగా ఇచ్చారు, మా సిబ్బంది కి కూడా టెక్నాలజీ పై అవగాహన కల్పిస్తున్నాం, 28 పోలీస్టేషన్ కు డ్రోన్లు ఇచ్చాం,24 గంటలూ ఎగిరే డ్రోన్ లు అందుబాటులో కి తెచ్చాం, ఇది రాజధాని ఏరియా కాబట్టి నిరంతరం నిఘా పటిష్ఠం చేశాం. అందరకీ ఆదర్శంగా మన పని తీరు ఉండేలా ముందుకు వెళుతున్నాం, సిఎం సూచనలు ప్రకారం మా వంతు కృషి చేస్తున్నాం.
ఈవ్ టీజింగ్ నియంత్రణ కు ప్రత్యేక చర్యలు చేపట్టాం, గంజాయి రవాణా చాలా వరకు నియంత్రణ చేశాం, అయితే ఇంకా అక్కడక్కడ గంజాయి దొరుకుతుంది, దీనిని కూడా నిరోధించేలా చర్యలు చేపట్టాం,మంచి పోలీసింగ్ తో పాటు, ప్రజల్లో నమ్మకం కలిగిస్తాం, ఇటీవల డ్రగ్స్ కూడా తీసుకువచ్చి అమ్ముతున్నారు,126 మంది విద్యార్థులు ఈ డ్రగ్ తీసుకున్నట్లు గుర్తించాం, ఈ డ్రగ్ తెచ్చినా, సేవించినా PIT NDPS యాక్ట్ కింద యేడాది బయటకు రాకుండా జైలులో ఉంటారు,వచ్చే ఆరు నెలల్లో గంజాయి, డ్రగ్ రవాణా లేకుండా నిరోధిస్తాం, క్రిమినల్, బ్లేడ్, గంజాయి బ్యాచ్ పై దృష్టి పెట్టాం, కమిషనరేట్ లో 3400 మంది నేరస్థులు ఉన్నారు, వారందరి ఫింగర్ ప్రింట్ లు, ఇతర ఆధారాలు సేకరించాం, ఇక నేరం చేసిన వారు ఎక్కడకీ తప్పించుకో లేరు, డేటా బేసిస్ ను ఉపయోగించి నేరాలను అదుపు చేస్తున్నాం, రోడ్డు ప్రమాదాలు నియంత్రణ కు చర్యలు చేపట్టాం, ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీటు బెల్ట్ వాడటం అలవాటు చేసుకోండి, పోలీసులు చేపట్టిన డ్రైవ్ ల వల్లే నేడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్నారు,సిసి కెమెరాలు ఫుటేజీ ద్వారా క్రైం కేసుల్లో చాలా క్లూస్ దొరుకుతాయి, ఇటీవల ఫోన్లు దొంగతనాలు జరిగితే సిసి కెమెరాలు ద్వారా లభించిన చిన్న సాక్ష్యం తో నేపాల్ బోర్డర్ లో దొంగలను పట్టుకున్నాం,శాంతిభద్రతల పరిరక్షణ కు టెక్నాలజీ వినియోగించు కోవాలని సిఎం చంద్రబాబు ఆదేశాలను పాటిస్తున్నాం, ప్రజల పట్ల పూర్తి బాధ్యత తో పోలీసు శాఖ పని చేస్తుంది, ప్రజలకు ఎటువంటి కష్టం, ఇబ్బంది ఉన్నా స్పందించి ముందుకు వస్తాం, కమిషనరేట్ లో ప్రతి గ్రామం, ప్రతి వార్డుల్లో మినిమమ్ నాలుగు సిసి కెమెరాలు ఉండేలా చర్యలు చేపట్టాం, సుజనా చౌదరి ముప్పై లక్షలు సిసి కెమెరాలు కోసం ఇచ్చారు, ప్రతి గ్రామం లో సిసి కెమెరాలు ఉన్న జిల్లా గా ఎన్,టి.ఆర్.జిల్లా రికార్డు సృష్టించబోతుంది
ఈ సందర్భంగా ఎం.పి. కేశినేని శివనాద్ (చిన్ని) మాట్లాడుతూ. ఎంపిగా ప్రమాణ స్వీకారం చేసి నేటితో యేడాది అయ్యింది, ఈరోజు తొలి సమావేశం ఒక మంచి కార్యక్రమం లో పాల్గొనడం ఆనందంగా ఉంది, పోలీసు కమీషనర్ రాజశేఖర్ బాబు విజయవాడ అభివృద్ధి లో కీలకంగా పని చేస్తున్నారు,కమాండ్ కంట్రోల్ రూమ్ ను తిరిగి అందుబాటులోకి తెచ్చారు, డ్రోన్ ల ద్వారా అసాంఘిక కార్యకలాపాలు అడ్డుకున్నారు, టెక్నలాజి ని అందిపుచ్చుకోవడంలో పోలీసు కమిషనర్ ప్రతిభ అపారం, వరదల సమయంలో, దసరా ఉత్సవాలు సమయంలో పోలీసులు పాత్ర కీలకం, టెక్నాలజీ ద్వారా ఒక చోట కూర్చునే మానటరింగ్ చేస్తున్నారు, చంద్రబాబు ఆలోచనలు కు అనుగుణంగా సిపి పని చేస్తున్నారు, మోడల్ పోలీస్టేషన్ గా సత్యనారాయణ పురం స్టేషన్ నిర్మాణం చేశారు, ఎన్.టి.ఆర్. జిల్లా మొత్తం అన్ని పోలీస్టేషన్ లు ఇలానే ఉండాలనేది నా కోరిక, హోం మంత్రి అనిత దృష్టి కి ఈ విషయాలు తీసుకెళతా, విజయవాడ వాసుల్లో దాతృత్వం ఎక్కువ, వరదల సమయంలో వారు చేసిన సేవలు అద్భుతం, దాతల సహకారంతో ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో సిసి కెమెరాలు లు ఏర్పాటు చేసుకున్నాం, పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు చొరవ, సిబ్బంది పని తీరు వల్ల జిల్లాలో నేరాలు తగ్గుముఖం పట్టాయి, ఇదే విధంగా దాతల సహకారంతో మరిన్ని ప్రాంతాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తాం, ఇటువంటి అభివృద్ధి లో పోలీసులు మమ్మలను కూడా భాగస్వామ్యం చేయడం ఆనందంగా ఉంది, పోలీసులు, ప్రజల కోసం ప్రజాప్రతినిధులు గా మా వంతు సహకారం ఎప్పుడూ అందిస్తాం అని తెలియజేశారు.
ఎం.ఎల్.ఏ. గద్దె రామమోహన్ మాట్లాడుతూ…. ముందుగా ఈ కార్యక్రమంలో పాల్గోవడం చాల ఆనందంగా ఉందని, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారు ఉత్తమ పోలీసింగ్ ఇవ్వడానికి విశేషంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. శాసన వ్యవస్థ, పోలీసు వ్యవస్థ కలసి పనిచేస్తే ఏ విధంగా ఉంటుందో అని చెప్పడానికి విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఒక నిదర్శనం అన్నారు. ట్రాఫిక్ విషయంలో కూడా మెరుగైన చర్యలతో ట్రాఫిక్ జామ్ కాకుండా, జంక్షన్ల క్రాసింగ్ల వద్ద ఎక్కువ సమయం పట్టకుండా చర్యలు తీసుకున్నారన్నారు. అలాగే విస్తృతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు ద్వారా నేరాల నియంత్రణ సాధ్యమవుతుందన్నారు.
అనంతరం సి.సి.కెమెరాలు ఏర్పాటు చేయడంలో సహకరించిన ధాతలను దుశ్శాలువాలతో సత్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ఎన్.టి.ఆర్.జిల్లా ఎం.పి. కేశినేని శివనాద్ (చిన్ని) ఎం.ఎల్.ఏ. శ్ గద్దె రామ్మోహన రావు డి.సి.పి. కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్. కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.