ప్ర‌జ‌ల జీవితాల్లో స‌రికొత్త కాంతులు నిండాలి జిల్లా ప్ర‌జ‌ల‌కు క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ దీపావ‌ళి శుభాకాంక్ష‌లు

Spread the love


ఎన్‌టీఆర్ జిల్లా, అక్టోబ‌ర్ 19, 2025

ప్ర‌జ‌ల జీవితాల్లో స‌రికొత్త కాంతులు నిండాలి

  • జిల్లా ప్ర‌జ‌ల‌కు క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ దీపావ‌ళి శుభాకాంక్ష‌లు

ప్ర‌జ‌ల జీవితాల్లో దీపావ‌ళి పండ‌గ‌తో స‌రికొత్త కాంతులు నిండాల‌ని.. ప్ర‌తిఒక్క‌రూ ఆనందోత్సాహాల‌తో సుర‌క్షితంగా పండ‌గ‌ను జ‌రుపుకోవాలని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ చెబుతూ జిల్లా ప్ర‌జ‌ల‌కు దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. దీపావళి.. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగని.. ప్రతికూల శక్తులను తొలగించి.. కొత్త వెలుగులు తీసుకొచ్చే గొప్ప పండ‌గ అని పేర్కొన్నారు. ప్ర‌తిఒక్క‌రి జీవితంలో ఆనందం వెల్లివిరియాల‌ని.. జిల్లా, రాష్ట్రం, దేశం అభివృద్ది ప‌థంలో ప‌య‌నించాల‌ని కోరుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు. ప‌ర్యావ‌ర‌ణానికి హాని క‌లిగించే ట‌పాసులు కాకుండా దీప కాంతుల‌తో ప‌ర్యావ‌ర‌ణహిత దీపావ‌ళి పండగ జ‌రుపుకోవాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ కోరారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *