ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం, MLA కార్యాలయం కట్టుబడి ఉండి ప్రజల అర్జీలను స్వీకరించి అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నిర్యం చెక్కులను పంపిణీ చేస్తున్నాం-MLA బొండా ఉమ

Spread the love

ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం, MLA కార్యాలయం కట్టుబడి ఉండి ప్రజల అర్జీలను స్వీకరించి అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నిర్యం చెక్కులను పంపిణీ చేస్తున్నాం-MLA బొండా ఉమ

ప్రజల కష్టసుఖాల్లో అండగా ఉండటం కూటమి ప్రభుత్వానికి ప్రధాన లక్ష్యం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమలవుతున్న CMRF ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి సకాలంలో సహాయం అందించడం, ఆపదలో ఉన్న కుటుంబాలకు భరోసా కల్పించడం నిత్యం కొనసాగుతోంది

ధి :-3-11-2025 సోమవారం ఈరోజు ఉదయం విజయవాడ సింగ్ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు పలు డివిజన్ లకు చెందిన అనారోగ్యంతో బాధపడి ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం చేపించుకున్నటువంటి బాధితులకు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరావు ముఖ్యమంత్రి సహాయనిధి ₹9 లక్షల 27వేల రూపాయలు (CMRF ) చెక్కులను బాధితులకు అందజేశారు….

ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ:-గత జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అనాలోచిత నిర్ణయాలతో వైద్యం పేదలకు అందని ద్రాక్ష లాగా మారిందని, ప్రభుత్వ వైద్యం పేదలకు దూరం చేయడంతో పాటు ప్రైవేటు కార్పొరేట్ వైద్యాన్ని అతి ఖరీదైన వైద్యంగా తయారు చేయడమే కాకుండా వ్యక్తిగత సులాభం కోసం వారిని ప్రోత్సహించి సామాన్యులకు పేదలకు  ప్రైవేటు వైద్యం అందుబాటులో లేకుండా భారీగా ఖరీదైన వైద్యంగా తయారు చేయడంలో జగన్ రెడ్డి ప్రభుత్వం కీలకపాత్ర వహించిందని బొండా ఉమా విమర్శించారు…

ఆనాడు 2014 నుండి 2019 వరకు ప్రభుత్వ వైద్యశాలలు డివిజన్ పరిధిలోని ప్రాథమిక వైద్యశాలలు అనేక రకాలైన వైద్యాలకు ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను ఇచ్చి వారి ఆరోగ్య బాగోవులను చూసుకున్న ప్రభుత్వం చంద్రబాబునాయుడు ప్రభుత్వం అని తాను ఆనాడు ఎమ్మెల్యే గా ఉండి సెంట్రల్ నియోజకవర్గంలో అనారోగ్యానికి గురై ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం చేపించుకున్న వేలాదిమందికి కోట్లాది రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి గా ఇచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు…

ఈ ఏడాది కాలంలో ప్రభుత్వ ఆసుపత్రులను అధునాతనమైన పరికరాలతో మంచి వైద్యం అందించడమే కాకుండా డివిజన్ల స్థాయిలో ఉన్న 14 ప్రాథమిక వైద్యశాలలలో  ఉన్నతమైన డాక్టర్లను నియమించి పూర్తి స్టాఫ్ ను ఏర్పాటు చేసి ఉచితముగా ల్యాబ్ పరీక్షలు నిర్వహించి మందులు ఇస్తూ  ప్రాథమిక వైద్యశాలలను అభివృద్ధి చేస్తున్నామని, అదేవిధంగా కార్పొరేట్ వైద్యశాలలలో, ప్రైవేటు వైద్యశాలలలో, సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలలో అనారోగ్యానికి గురై వైద్యం చేపించుకొన్నవారిని ఆర్థికంగా ఆదుకునేందుకు సెంట్రల్ నియోజకవర్గంలో నాకు అప్లై చేసుకున్న వారి అందరికీ సీఎం సహాయ నిధి నుండి పెద్ద మొత్తంలో చెక్కులను ఇస్తూ వారిని ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఆదుకుంటూ ఉన్నానని భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి వైద్యం అందించడమే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు సాగుతుందని సెంట్రల్ నియోజకవర్గం లో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలను, కార్పొరేషన్ పరంగా ఉన్న వైద్యశాలలను అభివృద్ధి చేసి అందరికీ ఆరోగ్యకరమైన మంచి వైద్యాన్ని అందించెందుకు కృషి చేస్తున్నానని తెలిపారు

Loading