ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా, నియోజకవర్గం లోని సమస్యల పరిష్కరిస్తూ, ఒక పక్కన అభివృద్ధిని రెండవ పక్కన సంక్షేమాన్ని ప్రజలకు అందజేస్తున్న – MLA బొండా ఉమ

3
0

14-7-2025

ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా, నియోజకవర్గం లోని సమస్యల పరిష్కరిస్తూ, ఒక పక్కన అభివృద్ధిని రెండవ పక్కన సంక్షేమాన్ని ప్రజలకు అందజేస్తున్న – MLA బొండా ఉమ

P4 కార్యక్రమంలో బంగారు కుటుంబం పథకం ద్వారా పేద కుటుంబాలను గుర్తించి, వారు ఆర్థికంగా స్థిరపడే విధంగా కుటుంబాలకు సహకారం అందించేందుకు కృషి చేస్తున్నాం

ధి:14-7-2025 సోమవారం ఉదయం 10:30″గం లకు ” సింగ్ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర పేదలకు తోపుడు బండ్లపై వ్యాపారం చేస్తున్నటువంటి వారికి, ఆకర్స్ కు  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్, బొండా ఉమామహేశ్వరరావు సొంత నిధులతో 36 తోపుడు బండ్ల ను మధురానగర్, కండ్రిక, గాంధీనగర్, దేవి నగర్, తదితర ప్రాంతాలలో రోడ్లు పక్కన చిరు వ్యాపారం చేసుకుంటున్న పేదలందరికీ ఉచితంగా  తోపుడు బండ్లను ఇవ్వడం జరిగినది

ఈ సందర్బంగా బొండా ఉమ మాట్లాడుతూ నియోజకవర్గంలో పేదలందరికీ వారు ఆర్థికంగా నిలబడేందుకు పూర్తి సహకారం అందిస్తామని, అనేక సంవత్సరాల నుండి నిరుపేదలుగా ఉంటూ వివిధ వీధులలో  తోపుడు బండ్లు పెట్టుకుని వ్యాపారాలు చేస్తూ జీవనో సాగిస్తున్నటువంటి వారి అందరికీ ఈరోజు తన సొంత నిధులతో P4 పథకం ద్వారా తోపుడుబండ్లను అందించడం జరిగిందని

గత ప్రభుత్వ హయాంలో వివిధ ఆంక్షలు పెట్టి రోడ్లు పక్కన చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి వారందరూ, గత ప్రభుత్వ వైఎస్సార్సీపీ జగన్ రెడ్డి పాలనలో ఆ ప్రభుత్వ దహన కాండకు ప్రతి ఒక్కరూ ఆర్థికంగా చిన్న భిన్నం అయ్యారని ధ్వజమెత్తారు

ఏడాది క్రితం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన NDA ప్రభుత్వం చిరు వ్యాపారస్తులకు బ్యాంకు రుణాలు ఇచ్చి అనేక పథకాల ద్వారా వారికి ఆర్థిక చేయూతను అందిస్తున్నామని మొదటగా పదివేల రూపాయలు, ఆ 10000 రుణం తీరిస్తే మరొక 20,000, అరుణం తీరిస్తే 50,000 ఇలాగా అనేక రకాలుగా గ్యారెంటీ లేకుండా వారి వ్యాపారాన్ని చిరునామాగా చూపిస్తూ వారికి రుణాలు ఇవ్వడమే కాకుండా రజకులకు ఇస్త్రీ చేసుకునేందుకు బండ్లు,ఇస్త్రీ పెట్టెలు, వివిధ వీధులలో తిరుగుతూ కూరగాయలు అమ్ముకునే వారికి తోపుడుబండ్లు, పలు సెంటర్లలో వివిధ రకాల ఫ్రూట్స్ అమ్ముకునేటువంటి వారికి ఇవ్వటమే కాకుండా వివిధ రూపాలలో ఉన్న ఆకర్స్ కి అందరికీ కూడా సచివాలయాల ద్వారా దరఖాస్తు చేపించుకొని వారికి గుర్తింపు ఇచ్చే విధంగా ఐడెంటి కార్డులు అందజేస్తూ, వారికి నగరపాలక సంస్థ నుండి పోలీసుల నుండి ఇబ్బంది లేకుండా పూర్తిస్థాయిలో సహకరిస్తున్నామని, ఈ సెంట్రల్ నియోజకవర్గంలో వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులు అందరికీ తాను అండగా ఉండటమే కాకుండా వారి వ్యాపారాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి, వారు ఆర్థికంగా నిలబడడానికి తన చేయూతను అందించడమే కాకుండా వారి భవిష్యత్తుకు దారి చూపుతానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో:- టిడిపి రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు,పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ సింగం వెంకన్న, మాజీ AMC డైరెక్టర్ గంటా కృష్ణమోహన్, 29వ డివిజన్ కార్పొరేటర్ కొంగి తల లక్ష్మీపతి, 64వ డివిజన్ అధ్యక్షులు కాకొల్లు రవికుమార్, 63వ డివిజన్ అధ్యక్షులు లబ్బా వైకుంఠం, ప్రధాన కార్యదర్శి కోలా శ్రీను, మాచర్ల గోపి, లక్కం రాజు శ్రీనివాస్ రాజు, దాసరి జయరాజు, మల్లంపల్లి సురేష్, అంగిరేకుల రాంబాబు, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here