ప్రజలు మార్పు కోరుకుంటున్నారు మాట మీద నిలబడతా అభివృద్ధి చేసి చూపుతా ఎన్నికల ప్రచారంలో సుజనా చౌదరి

Spread the love

 ప్రజలు మార్పు కోరుకుంటున్నారు  మాట మీద నిలబడతా అభివృద్ధి చేసి చూపుతా

ఎన్నికల ప్రచారంలో సుజనా చౌదరి

వైసీపీ అరాచక పాలనను సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 39వ డివిజన్ లో సుజనా పర్యటించారు. విద్యాధరపురం క్వారీ సెంటర్, అరవింద వీధి, టీవీ కృష్ణారావు స్ట్రీట్ తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్న వైసీపీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వైసీపీ అరాచక పాలనను ఇంటికి సాగనంపేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్నారు. అయిదేళ్ల వైసీపీ పాలనలో కూల్చివేతలు, అరాచకాలు, అభద్రత, అశాంతి మినహా అభివృద్ధి-సంక్షేమం ఏ మాత్రం లేవన్నారు. అన్ని రంగాల్లో ఏపీకి తీవ్రమైన నష్టం వాటిల్లిందన్నారు. ఏపీని గాడిన పెట్టుకునే అవకాశం ఎన్నికల రూపంలో వచ్చిందని, విధ్వంస పాలనను సాగనంపి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా సేవలందించిన తాను మాటమీద నిలబడేవాడినని పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి‍కి కేంద్రబిందువుగా మారుస్తానని హామీ ఇచ్చారు. సుజనాకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి ఎమ్మెస్ బేగ్ ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, పైలా సోమినాయుడు జనసేన నాయకులు బాడిత శంకర్, అమ్మిశెట్టి వాసు,  

39వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు రేగళ్ల లక్ష్మణ్, జనసేన డివిజన్ అధ్యక్షులు ఏలూరి శరత్ కుమార్ బీజేపీ డివిజన్ అధ్యక్షులు పచ్చిపులుసు వెంకట శివ ప్రసాద్, జనసేన డివిజన్ నాయకులు వినోద్, అబ్దుల్, రత్నకుమార్, కిరణ్, బీజేపీ నాయకులు బబ్బూరి శ్రీరామ్, పీయూష్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *