విజయవాడ నగరపాలక సంస్థ
03-03-2025
ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోండి
విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు
ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. సోమవారం ఉదయం శాఖధిపతులు మరియు సచివాలయ సిబ్బందితో టెలికాన్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ కాన్ఫరెన్స్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సానిటేషన్, ప్లానింగ్, ఎమినిటీ సెక్రటరీలు సమన్వయంతో పని చేయాలని, ఎమినిటీస్ అందరూ సకాలంలో పన్నులు వసూలు చేయాలని, ఒక సచివాలయం పరిధిలో ఎటువంటి సమస్య ఉన్న వెంటనే స్పందించి పరిష్కరించాలని, అధికారులు ఎప్పుడు వారిని పర్యవేక్షిస్తూ వారికి కావలసిన సహకారాన్ని ఎల్లప్పుడూ అందించాలని, అన్నారు. ఫీల్డ్ లెవెల్ లో ఉన్న ప్రతి చిన్న సమస్యను క్షుణ్ణంగా గమనించి అధికారులకు తెలియజేసి తగిన చర్యలు పరిష్కారాన్ని అందించాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు.