విజయవాడ నగరపాలక సంస్థ
27-02-2025
ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోండి
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు
ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గురువారం ఉదయం జక్కంపూడి ప్రాంతం మొత్తం పర్యటించి రోడ్లు, త్రాగునీరు, డ్రైన్లు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అక్కడ నివసిస్తున్న ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని, వేసవికాలంలో త్రాగునీటి సరఫరా లో ఎటువంటి సమస్యలు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అందుకు అనుగుణంగా ఉన్న చిన్న చిన్న రిపేర్లను పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కాలుష్యం తగ్గించే విధంగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు మొక్కలను నాటాలని, వీధి దీపాలు మరమ్మతులు లేకుండా ఉండాలని, డ్రైనేజ్ సమస్యలు తలెత్తకుండా అధికారులు పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు పరిశుభ్రపరచాలని, కమ్యూనిటీ హాల్ లో ఉన్న మరమతులను త్వరితగతిన పూర్తి చేసి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని, వ్యర్థాలను, నిర్మాణ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ పారిశుధ్యంలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరిండెంటింగ్ ఇంజనీర్లు పి సత్యకుమారి, పి సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.