ప్రకాశం బ్యారేజ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

Spread the love

ప్రకాశం బ్యారేజ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

 

ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీ కొట్టిన ప్రాంతాన్ని సోమవారం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి పరిశీలించారు. ప్రకాశం బ్యారేజ్ కి చరిత్రలో ఎప్పుడూ లేనంత వరద ఉధృతి కొనసాగుతుందన్నారు. ప్రవాహానికి కొట్టుకు వచ్చిన బొట్ల వలన గేటు మరమ్మతులకు గురైందని దీనివల్ల ప్రకాశం బ్యారేజ్ కి ఏమి ఇబ్బంది లేదు అన్నారు. వరద తగ్గిన వెంటనే వేగంగా మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు ఇంద్రకీలాద్రిపై ఘాట్ రోడ్డు లో భారీ వర్షాలకి కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తో కలిసి పరిశీలించారు. కొండ చరియలు విరిగిపడ్డ ఘటనలో ఎవరికి ఎలాంటి హాని జరగలేదని ఘాట్ రోడ్ నిర్మాణం చేపట్టి త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *