పోలీస్ వెల్ఫేర్ డే” కార్యక్రమంలో “21” ఫిర్యాదులను స్వయంగా స్వీకరించిన పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్

Spread the love

పోలీస్ వెల్ఫేర్ డే” కార్యక్రమంలో “21” ఫిర్యాదులను స్వయంగా స్వీకరించిన పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డి.జి.పి. సి.హెచ్.ద్వారకాతిరుమల రావు ఐ.పి.ఎస్ ఉత్తర్వుల మేరకు పోలీస్ సిబ్బంది సంక్షేమందృష్ట్యా ప్రతి శుక్రవారం పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం నందు పోలీస్ వెల్ఫేర్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ది.16.08.2024వ తేదీన కమిషనర్ వారి కార్యాలయం నందు “పోలీస్ వెల్ఫేర్ డే” కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.ఎస్.నిర్వహించినారు. 

ఈ పోలీస్ వెల్ఫేర్ డే నందు పోలీస్ సిబ్బంది నుండి బదిలీలు, సర్వీసుకు సంబంధించిన వివిధ సమస్యల పై వచ్చిన 21 ఫిర్యాదులు గురించి వారితో కమిషనర్ స్వయంగా మాట్లాడి వాటిని సత్వరం పరిష్కరించవలసినదిగా సంబంధిత సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించే పోలీస్ వెల్ఫేర్ డే కార్యక్రమాన్ని సిబ్బంది స్వయంగా తమ సమస్యలను విన్నవించిన వెంటనే వాటిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, కావున పోలీస్ సంక్షేమం దృష్ట్యా నిర్వహించే ఈ పోలీస్ వెల్ఫేర్ డే కార్యక్రమాన్ని అవసరం ఉన్న పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ తెలియజేశారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *