Tuesday, August 5, 2025
Google search engine
HomeAndhra Pradeshపోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో “84” ఫిర్యాదులు.

పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో “84” ఫిర్యాదులు.

ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, విజయవాడ.
ది.28.07.2025.

పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో “84” ఫిర్యాదులు.

ప్రజాసమస్యల సత్వర పరిష్కారం కోసం “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి 13.00 గంటల వరకు ఎన్. టి. ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది.

 ఈ నేపధ్యంలో ఈ రోజు ది.04.08.2025వ తేదిన పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో ఎన్.టీ.ఆర్.జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.యస్  ఆదేశాలు మేరకు డి.సి.పి.  ఏ.బి.టి.ఎస్.ఉదయారాణి ఐ.పి.ఎస్, “ప్రజా సమస్యల పరిష్కార వేదిక”( పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం) కార్యక్రమాన్ని నిర్వహించి బాధితులు నుండి వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 84 ఫిర్యాదులపై భాదితులతో మాట్లాడటంతో పాటుగా, దివ్యాంగులు, వృద్ధుల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలు గురించి అడిగి తెలుసుకుని వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఫోన్  ద్వారా సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ లతో మాట్లాడి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ  చేయడమైనది. 

ఈరోజు అందిన ఫిర్యాదుల్లో భూవివాదాలకు, ఆస్తి వివాధాలకు, నగదు లావాదేవీలకు సంబంధించినవి 45, భార్యాభర్తలు, కుటుంబ కలహాలకు సంబంధించినవి 07, కొట్లాటకు సంబంధించినవి 02, వివిధ మోసాలకు సంబంధించినవి 03, మహిళా సంబంధిత నేరాలకు సంబంధించి 05, దొంగతనాలకు సంబంధించి 05, ఇతర చిన్న చిన్న వివాదాలు సమస్యలకు, సంఘటనలకు సంబంధించినవి 17, మొత్తం 84 ఫిర్యాదులును స్వీకరించడం జరిగినది.

ఈ కార్యక్రమంలో డి.సి.పి. ఏ.బి.టి.ఎస్.ఉదయారాణి ఐ.పి.ఎస్., ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొని ఫిర్యాదులు పరిష్కరించుటలో సహకారాన్ని అందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments