పేద విద్యార్థికి అండగా
ఎమ్మెల్యే సుజనా చౌదరి
సామాజిక సేవలో ముందుండే ఎమ్మెల్యే సుజనా చౌదరి మరోసారి తన ఉదారత చాటుకున్నారు.
సుజనా ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు , నిరుపేదలకు అనేక రకాలుగా సాయం అందించిన ఆయన ఇప్పుడు పేద విద్యార్థి చదువు కోసం ఆర్థిక సాయం అందించారు.
కళాశాల ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్న పేద విద్యార్థికి ఎమ్మెల్యే సుజనా చౌదరి సుజనా ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు.
హెచ్ బీ కాలనీ కు చెందిన ఫ్రాన్సిస్ ఏంజెల్ మనోహర్ మణిపూర్ లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నాడు ఆర్థిక పరిస్థితి బాలేక కళాశాల ఫీజు కట్టలేక అనేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థి తల్లి కటికల రాణి ఎమ్మెల్యే సుజనా చౌదరి కు తెలియజేయగా సాయం చేస్తానని హామీ ఇచ్చారు.
సుజనా ఆదేశాలతో
పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి
ప్రత్తిపాటి శ్రీధర్ రూ 25 వేల ను మంగళవారం భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో అందజేశారు.
ఇచ్చిన మాట ప్రకారం ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు విద్యార్థి తల్లి కటికల రాణి కృతజ్ఞతలు తెలిపారు..