పేద ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం జగన్ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్

Spread the love

 పేద ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం జగన్ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్

న్యూ రాజరాజేశ్వరి పేట ప్రజల చిరకాల వాంఛ ను నెరవేర్చింది వైసీపీ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేట 57వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో స్థానిక కార్పొరేటర్ ఈసరపు దేవి తో కలిసి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలను కరపత్ర రూపంలో ప్రజలకు అందజేసి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి మాట్లాడుతూ… న్యూ రాజరాజేశ్వరి పేటలో ఎన్నికల ప్రచారంలో ప్రజల నుండి అపూర్వమైన స్వాగతం లభిస్తుందని, ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను గత ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని చెప్పారు. దశాబ్దాలుగా న్యూరాజరాజేశ్వరి పేటలో ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ అవ్వక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతుంటే సీఎం జగన్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే శాశ్వత ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను అమలు చేశారని పేర్కొన్నారు. రాజరాజేశ్వరి పేట లో టిక్కో వఇళ్ళ పేరుతో టిడిపి నేతలను పేద ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఈ డివిజన్లో మునిపెనోడు లేని విధంగా అభివృద్ధి కొత్త పుంతలు తోక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *