15-07-2025
పేదలకు వరం తల్లికి వందనం పథకం
సీఎం చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
పశ్చిమ నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో
పాల్గొన్న మంత్రి ఎన్.ఎమ్.డి ఫరూఖ్, ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
విజయవాడ:పరిపాలన దక్షుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుంది. రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమ పథకాల అమలుతో ప్రజలందరూ సంతోషంగా వున్నారు. రాష్ట్రంలోని విద్యార్ధులు ఎలాంటి ఇబ్బంది లేకుండా చదువుకోవాలనే ఉద్దేశ్యంతోనే సీఎం చంద్రబాబు నాయుడు తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నారు. ఈ పథకం పేదలకు వరం లాంటిదని రాష్ట్ర న్యాయ, మైనార్టీ వెల్పేర్ శాఖ మంత్రి ఎన్.ఎమ్.డి పరూఖ్, ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.
పశ్చిమ నియోజకవర్గంలో 54వ, 55వ డివిజన్ల లో మంత్రి పరూఖ్, ఎంపీ కేశినేని శివనాథ్ సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమాన్ని నియోజవర్గ అబ్జర్వర్ చిట్టాబత్తుని శ్రీనివాసరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా, రాష్ట్ర నాయకులు గన్నె ప్రసాద్ లతో కలిసి మంగళవారం నిర్వహించారు. ముందుగా పంజా సెంటర్ వద్ద వున్న దర్గా లో మంత్రి ఫరూఖ్, ఎంపీ కేశినేని శివనాథ్ ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి, కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాలను వివరించారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ తల్లికి వందనం పథకం ద్వారా మైనార్టీలకు ఎక్కువగా లబ్ధి చేకూరిందన్నారు. ఇంట్లో ఎంత మంది విద్యార్ధులు చదువుకుంటుంటే ఒక్కొక్కరికి రూ.15వేలు చొప్పు ఇవ్వటంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆనందంగా వున్నారన్నారు. ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు నాయకత్వంలో ముస్లిం సోదరులు చాలా ఆనందంగా వున్నారని తెలిపారు. తల్లి వందనం పథకం అమలు చేసినందుకు సీఎం చంద్రబాబు కి మైనార్టీ సమాజం ధన్యవాదాలు తెలుపుతుందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చే నాలుగేళ్లలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు అభివృద్ది లక్ష్యాలను ఏ విధంగా సాధించాలనే అంశం పై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.
ఎన్టీఆర్ భరోసా పథకం కింద వృద్ధులు, వితంతువులకు రూ.4 వేలు, దివ్యాంగులు, కుష్టు రోగులకు రూ.6 వేలు, కిడ్నీ, కాలేయం, తలసీమియా బాధితులకు రూ.10 వేలు, పూర్తి వైకల్యం ఉన్న వారికి రూ.15 వేలు చొప్పున ప్రతి నెలా తమ ప్రభుత్వం మంజూరు చేస్తుందని ఎంపీ పేర్కొన్నారు. దీపం పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు ఎంపీ స్పష్టం చేశారు. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను ప్రభుత్వం వేగవంతం చేసిందని ఎంపీ తెలిపారు.
అనంతరం మంత్రి ఫరూఖ్ మాట్లాడుతూ సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ తో కలిసి పాల్గొనటం ఆనందంగా వుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ప్రజలందరూ బ్రహ్మారధం పడుతున్నారని తెలిపారు. ముస్లిం సామాజిక వర్గానికి ఎంతగానో ఉపయోగపడే విధంగా తల్లికి వందనం పథకం అమలు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 42 లక్షల మందికి మాత్రమే అమ్మఒడి పథకం అందిస్తే …ఎన్డీయే కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం 67 లక్షల మందికి అందించిందన్నారు. పేదలకు వరంగా మారిన తల్లికి వందనంతో ఎంతో మంది తల్లిదండ్రులు వారి పిల్లలను చదివిస్తున్నారన్నారు. అలాగే మంత్రి నారా లోకేష్ చొరవతో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం ఇంటర్ విద్యార్ధులకు ఎంతో ఉపయోగకరంగా వుందన్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమల్లోకి రానుందని తెలిపారు.
మంత్రి ఫరూఖ్ ను సన్మానించిన ఎంపి కేశినేని శివనాథ్
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం అనంతరం గణపతి రోడ్ లో గల ఎంపి కేశినేని శివనాథ్ క్యాంపు కార్యాలయానికి మంత్రి ఫరూఖ్ విచ్చేశారు. ఈ సందర్బంగా ఎంపీ కేశినేని శివనాథ్ మంత్రి ఫరూఖ్ ను సత్కరించి జ్ఞాపికను బహుకరించారు.
ఈ కార్యక్రమంలో 54వ డివిజన్ అధ్యక్షుడు హజీజ్, 55వ డివిజన్ అధ్యక్షుడు జాహీద్, కార్పొరేటర్లు మైలవరపు దుర్గారావు, హర్షద్, తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ,రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎస్.ఎమ్.ఫైజాన్, పశ్చిమ నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు సుఖాసి సరిత, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు ఆర్.మాధవ, నియోజవకర్గ బిసి సెల్ అధ్యక్షుడు నమ్మి భాను ప్రకాష్ యాదవ్, జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షుడు సొలంకి రాజు, క్లస్టర్ ఇన్చార్జ్ ధనేకుల సుబ్బారావు,ఎ.ఎమ్.సి డైరెక్టర్ మైలపల్లి రాజు, టిడిపి నాయకులు, పేటేటి రాజమోహన్, పీతా బుజ్జి, పట్నాల హరిబాబు, వడ్డాదినరేష్, భవానీ శంకర్, సలీమ్, తాజుద్దీన్, వరలక్ష్మీ,
టిడిపి సీనియర్ మహిళా నాయకురాలు బంకా నాగమణి, సీనియర్ నాయకులు మరుపిళ్ల తిరుమలేష్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.