9-8-25
నిమ్మాడ
పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి
- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
ముఖ్యమంత్రి సహాయనిది కింద ఇప్పటివరకు 81 మంది లబ్ధిదారులకు రూ. కోటి 37 లక్షల రూపాయలు పంపిణీ
రూ. 23,44,463 చెక్కులను లబ్ధిదారులకు మంత్రి వర్యలు చేతుల మీదుగా పంపిణీ
మంత్రి వర్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు*
అనారోగ్య పరిస్థితులతో ఆర్థికంగా సతమతమవుతున్న పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధివరం లాంటిదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు అన్నారు. నిమ్మాడ కార్యాలయంలో శనివారం18 మంది లబ్ధిదారులకు రూ. 23,44,463 చెక్కులను మంత్రి వర్యలు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వర్యులు ఇప్పటివరకు 81 మంది లబ్ధిదారులకు రూ. ఒక కోటి 30 లక్షల రూపాయలు లబ్ధిదారులకు చెక్కుల రూపంలో అందించడం జరిగిందని పేర్కొన్నారు. వైద్య ఖర్చులు భారమై ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారి జీవితాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి వెలుగులు నింపుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అదికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలకు అన్ని విధాలా మేలు చేసేలా పని చేస్తున్నదన్నారు. వైద్యఖర్చులతో ఆర్థిక అవస్థలు పడుతున్న ప్రజానీకానికి ముఖ్యమంత్రి సహాయనిధి ఆపన్నహస్తంలా నిలుస్తోందని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి సహాయ నిధులు సైతం పక్కదారి పట్టించారని ఆరోపించారు. రాష్ట్రంలో సుమారు 400 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి అందించడం జరిగిందని అన్నారు. చెక్కలు అందుకున్న లబ్ధిదారులు మంత్రి వర్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్య మంత్రి సహాయనిధి అందుకున్న లబ్ధిదారుల వివరాలు
టి. షన్ముఖరావు, నందిగాం మండలం, కర్లపుడి, రూ. 1.80,000, ఎన్. సుందరమ్మ నందిగాం మండలం, కవిటి అగ్రహారం, రూ. 72, 656, జి.గిరిబాబు, నందిగాం మండలం, చెరుకుపల్లి, రూ, 41,200, బి.గజపతిరావు, నందిగాం మండలం, రూ.36,500, టీ,లక్ష్ము అమ్మ సంతబొమ్మాళి మండలం, లక్కివలస, రూ, 54,258, ఎం, కర్రయ్య, సంతబొమ్మాళి మండలం లక్కివలస, రూ.1,40,000, ఎస్, రాజేశ్వరి, సంతబొమ్మాళి మండలం,
ఆర్,హెచ్పురం, రూ, 58,318, ఎస్, తాతయ్య, సంతబొమ్మాళి మండలం, లక్కివలస, రూ,58,795, జి.వెంకటరావు, సంతబొమ్మాళి మండలం కాశీపురం, రూ, 60,000, పి.మల్లేసు, సంతబొమ్మాళి మండలం, చిల్లపేట, రూ, 32,000, డి, సింహచలం సంతబొమ్మాళి మండలం మూలపేట, రూ.4,00000, ఎన్, మోహిత్, సంతబొమ్మాళి మండలం, డిజీపురం, రూ. 45, 178, ఎ,ఎస్ గుప్తా కోటబొమ్మాళి గ్రామం, రూ.84,074, పి. ఉదయ్ కుమార్ కోటబొమ్మాళి, మండలం, పట్టుపురం, రూ. 74,358, కె.వాణయ్య, కోటబొమ్మాళి మండలం, సింహాద్రిపురం, రూ. 87,226, బి.కుమారి, కోటబొమ్మాళి మండలం చీపుర్లపాడు, రూ. 20,000, టి.భాస్కరరావు, శ్రీకాకుళం,రూ. 5,00000, బి.సత్యన్నారాయణ, టెక్కలి మండలం సొర్లిగాం, రూ.4,00000, లబ్దిదారులకు మంత్రి వర్యలు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, తెలుగు దేశం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.