పేదప్రజల సంక్షేమం కోసం పోరాడిన మహోన్నత నేత వంగవీటి మోహనరంగా రంగా ఆశయాలు సాధిస్తాం మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు

4
0

 పేదప్రజల సంక్షేమం కోసం పోరాడిన మహోన్నత నేత వంగవీటి మోహనరంగా రంగా ఆశయాలు సాధిస్తాం

మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు

 

కొండపల్లిలో ఘనంగా రంగా 77వ జయంతి.

ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లి, 4.7.2024

పేదప్రజల. సంక్షేమం కోసం పోరాడిన మహోన్నత నేత వంగవీటి మోహనరంగా అని, ఆయన చూపిన బాటలో పయనిస్తూ దివంగత రంగా ఆశయాలను సాధిస్తామని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు స్పష్టం చేశారు

కొండపల్లి మున్సిపాలిటీలో దివంగత నేత వంగవీటి మోహనరంగా 77వ జయంతిని గురువారం ఘనంగా జరుపుకున్నారు. మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ తో పాటు, వంగవీటి రంగా తనయులు, టీడీపీ నాయకులు వంగవీటి రాధాకృష్ణ బి కాలనీలోని వంగవీటి మోహనరంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దివంగత నేత రాజీవ్ గాంధీ విగ్రహానికి, ప్రముఖ నాయకులు, మహామేధావి కె.ఎల్ రావు విగ్రహానికి కూడా పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ముందుగా కొండపల్లి బి కాలనీ బస్టాప్ నుంచి రైల్వే స్టేషను వరకు రంగా అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు.జోహార్ వంగవీటి మోహన్ రంగా అంటూ ప్రజలు నినదించారు. అనంతరం కొండపల్లి రైల్వేస్టేషన్ సెంటర్లో జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా కేకులను కట్ చేశారు. రైల్వేస్టేషన్ సెంటర్లో రంగా విగ్రహానికి, మాజీ ప్రధాని ఇందిరమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు మాట్లాడుతూ తెలుగు వారందరి గుండెల్లో గూడు కట్టుకున్న మహోన్నత నేత వంగవీటి మోహన్రంగా అని అన్నారు. పేదల పక్షాన నిలబడి ఆయన అనుసరించిన విధానాలే ఆయన్ని అందరి మనిషిగా తీర్చిదిద్దాయన్నారు. తాము కూడా ఆయన బాటలోనే పయనిస్తూ పేదలకు సేవలను అందిస్తామన్నారు

వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో అందరం ఐకమత్యంగా కలసి మెలసి ఏ విధంగా పని చేశామో అదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో కూడా పని చేస్తూ పేదలకు సేవలను అందించాలని అన్నారు

ఈ కార్యక్రమంలో జనసేన మైలవరం నియోజకవర్గ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) , బీజేపీ నియోజకవర్గ ఇంచార్జి నూతులపాటి బాలకోటేశ్వరరావు (బాల) , ఎన్డీఏ మహాకూటమి నాయకులు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here