విజయవాడ నగరపాలక సంస్థ
01-03-2025
పెన్షన్ దారులకు సకాలంలో పెన్షన్ పంపిణీ
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శనివారం ఉదయం అధికారులు, సచివాలయం సిబ్బంది లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్కిల్ 3 పరిధిలోని రామలింగేశ్వర నగర్ లో పెన్షన్ పంపిణీ చేసిన ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు సి డి) పి.వెంకటనారాయణ మాట్లాడుతూ, కమిషనర్ ఆదేశాల మేరకు లబ్ధిదారులందరికీ సకాలంలో పెన్షన్ పంపిణీ చేస్తున్నారని, అధికారులు, సచివాలయం సిబ్బంది తమ పరిధిలోగల పెన్షన్ దారులు అందరికీ శనివారం ఉదయం నుండి ఫంక్షన్ పంపిణీ చేస్తున్నారని. శనివారం మధ్యాహ్నం మూడు గంటల వరకు నగరపాలక సంస్థ పరిధిలోగల సర్కిల్ 1 పరిధిలో 20,392 పెన్షన్ లకు 17,065, సర్కిల్ 2 పరిధిలో ఉన్న 25,676 గాను 23,390 సర్కిల్ 3 పరిధిలో ఉన్న 20,437 గాను 17,540 పెన్షన్లు పంపిణీ చేశారని, మిగిలినవి కూడా సత్వరమే పూర్తి చేసి పింఛన్ లబ్ధిదారులకు సత్వరమే అందిస్తారని తెలిపారు.