ది.25.05.2024.
శ్రీ తిరుపతమ్మ అమ్మవారు శక్తి సంపద దయాదాక్షిణ్యలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై మెండుగా ఉండాలని మాజీ దేవదయ శాఖ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం ఆయన ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో కొలువైన శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ‘శక్తి’ ప్రతిరూపంగా పూజింపబడుతున్న అమ్మవారిని దర్శించుకుని మాట్లాడారు…. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధి పొందిన దేవాలయాల్లో శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం ఇది ఒకటని అన్నారు. తన భక్తులకు జీవితంలోని సద్గుణాలను ప్రసాదించే మాత అని చెప్పారు. పెనుగంచిప్రోలు లో తిరుపతమ్మ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇది రాష్ట్రంలో 11వ స్థానంలో ఉండి ఎంతో గొప్ప పేరు తెచ్చుకుందని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. అనంతరం శ్రీ తిరుపతమ్మ అమ్మవారి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు, ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. సీఎం జగన్ ప్రభుత్వం రెండోసారి ఏర్పాటు అయ్యేందుకు శ్రీ తిరుపతమ్మ అమ్మవారు ఆశీస్సులు నిండుగా ఉన్నాయని తెలిపారు. వెల్లంపల్లి అమ్మవారికి ఈ సందర్భంగా పూజలు నిర్వహించారు.