పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి తదితరులు ప్రజల వద్ద దోచుకున్న డబ్బులు పంచి క్షమాపణ చెప్పాలని ఉత్తరాంధ్ర టిడిపి ఇంచార్జ్ బుద్ధ వెంకన్న డిమాండ్

Spread the love

 పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి తదితరులు ప్రజల వద్ద దోచుకున్న డబ్బులు పంచి క్షమాపణ చెప్పాలని ఉత్తరాంధ్ర టిడిపి ఇంచార్జ్ బుద్ధ వెంకన్న డిమాండ్

చేశారు. పుంగునూరులో తండ్రి కొడుకులు పై దాడి చేసింది స్థానిక ప్రజల తప్ప తెలుగుదేశం కార్యకర్తలు కాదన్నారు. ఏపీ మొత్తం పెద్దిరెడ్డి గనులు శాఖ మంత్రిగా న్యాయబద్ధంగా వ్యాపారాలు చేసేవారి వద్దనుండి దౌర్జన్యంగా వారి వ్యాపారాలను లాక్కున్నారని వెంకన్న ఆరోపించారు. ఎన్నికల సమయంలో పెద్దిరెడ్డి సొంత ఊరైన తుంగనూరులో కిరాయి రౌడీలు చేత బాబుపై దాడి చేయించింది పెద్దిరెడ్డి అని ఆయన ఆరోపించారు. పెద్దిరెడ్డి చేయించిన దాడిని ధైర్యంగా ఎదుర్కొన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు మాత్రమేనన్నారు. తండ్రి కొడుకులు పై దాడి చేయించే అవకాశం ఉన్నప్పటికీ అలాంటి చర్యలకు పాల్పడే చంద్రబాబుకు లేదన్నారు. ప్రస్తుతం బాబు రామరాజు పాలన చేస్తుండగా, . జగన్ రాక్షస పాలన సాగించారన్నారు. పెద్దిరెడ్డి బాధితులు ఎవరైనా ఉంటే వారికి న్యాయం చేసి వారి ఆస్తులను తిరిగి అప్పగిస్తామని బుద్ధ వెంకన్న భరోసా ఇచ్చారు. జగన్ కు వ్యవస్థల గురించి పూర్తిగా తెలియదని, అందుకే దొంగకు తాళం చేతులు ఇచ్చినట్లు గనులు ఉన్న పెద్దిరెడ్డికి ఆ శాఖనే అప్పగించడంతో పెద్దిరెడ్డి వెయ్యి సంవత్సరాలకు సరిపడే ఆస్తులను సంపాదించారని బుద్ధ వెంకన్న ఆరోపించారు. లోకేష్ రెడ్ బుక్ జోలికి వెళ్లలేదని, కేవలం సంక్షేమ పాలన కోసం. కృషి చేస్తున్నారన్నారు. పులి తోలు కప్పుకున్న పిల్లి లా గురించి జగన్ పూర్తిగా తెలుసుకోలేకపోయారని బుద్ధ వెంకన్న పేర్కొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *