పెడన మండలం చేవెండ్ర గ్రామానికి చెందిన సైనికులు సాదరబోయిన నాగరాజు భౌతిక కాయం ఉన్న మహాప్రస్థానం

Spread the love

 మచిలీపట్నం జులై 1

పెడన మండలం చేవెండ్ర గ్రామానికి చెందిన సైనికులు సాదరబోయిన నాగరాజు భౌతిక కాయం ఉన్న మహాప్రస్థానం

వాహనం సోమవారం రాత్రి వారి ఇంటి వద్దకు చేరుకోగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా పోలీసు అధికారి అద్నాన్ నయీం అస్మి, పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ నాగరాజు భౌతిక కాయంపై పుష్పగుచ్చాలను ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు.

గ్రామస్తులు తండోపతండాలుగా తరలివచ్చి నాగరాజు భౌతిక కాయాన్ని చూసి బోరున విలపించారు.

నాగరాజు అమర్ రహే అంటూ గ్రామస్తులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

కలెక్టర్ వెంట ఆర్డిఓ ఎం వాణి అదనపు ఎస్పీ ఎస్ వి డి ప్రసాద్, డి.ఎస్.పి సుభాని , పలువురు పోలీస్ అధికారులు, సైనిక అధికారులు, ఎన్సిసి అధికారులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *