పెట్టుబడులు అడ్డుకుంటే వైసిపికి పుట్టగతులు ఉండవు

1
0

పెట్టుబడులు అడ్డుకుంటే వైసిపికి పుట్టగతులు ఉండవు

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకంతోనే పెట్టుబడులు వస్తున్నాయి

20 లక్షలు యువతకు ఉద్యోగాలు కల్పించుటయే కూటమి ప్రభుత్వం లక్ష్యం మని కైకలూరు పాత్రికేయులు సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి ...

  ఏలూరు/కైకలూరు,జూలై 28: కైకలూరు సియన్ ఆర్ గార్డెన్స్ లో సోమవారం రాష్ట్ర గృహ నిర్మాణ,సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, స్థానిక ఎమ్మెల్యే డా.కామినేని శ్రీనివాస్ సంయుక్తంగా పాత్రికేయులు సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ 2019 నుంచి 2024 రాష్ట్రంలోని అన్ని వనరులను దోచుకుని, దాచుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసిపికి ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా సిగ్గులేకుండా ప్రస్తుతం ప్రణాళికాబద్దం చేస్తున్న రాష్ట్రాభివృద్ధిని కుట్రలు, కుతంత్రాలతో అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పేదల సంక్షేమానికి కృషి చేస్తుంటే ప్రతిపక్ష హోదా కూడా లేని వైసిపి నాయకులు సంక్షేమాన్ని,అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాని దుయ్యబట్టారు. విదేశాలు నుంచి పరిశ్రమల రూపంలో వచ్చే పెట్టుబడులు రాకుండా విధ్వంసం సృష్టిస్తున్నారని,అయినా చంద్రబాబుపై నమ్మకంతో అనేక సంస్థలు ముందుకు వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చిన సింగపూర్ కంపెనీలను విధ్వంసాలతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని,పెట్టుబడులకు అడ్డుపడితే వైసిపికి భవిష్యత్తులో పుట్టగతులు ఉండవని గుర్తించాలని అన్నారు.చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు 130 దేశాల్లో సాఫ్ట్వేర్,ఇతర ఉద్యోగులు,వారి కుటుంబాలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారంటే చంద్రబాబుపై ఎంతనమ్మకం ఉందో అర్ధమవుతుందన్నారు.పరిశ్రమలు ద్వారా పెట్టు బడులు వస్తేనే ప్రైవేటు రంగాల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని,వైసిపి కుతంత్రాలను ప్రజలు అర్ధం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. వైసిపి భాష, భావజాలం విధ్వంసం సృష్టించేలా ఉన్నాయని,వారి ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని మంత్రి కొలుసు పార్థసారధి పిలుపునిచ్చారు.

ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ కైకలూరు పేదలకు గృహ నిర్మాణాల కార్యక్రమం ఈ రోజు గృహ నిర్మాణ శాఖ మంత్రి రాకతో వేగవంతం అవుతుందన్న నమ్మకం కలిగిందన్నారు. 2019-24 గత వైసిపి పాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలు దురదృష్టకరం సంఘటన అన్నారు. తల్లికి,చెల్లికి అన్యాయం చేసినవారు రాష్ట్రానికి ఏమి చేస్తారని కొన్ని సీట్లు ఇచ్చారని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రానున్న రోజుల్లో సంక్షేమం,అభివృద్ధి కార్యక్రమాలు విజయ వంతంగా అమలు చేస్తామని అన్నారు.ఇచ్చిన హామీలు, ఇవ్వని హామీలు కూడా నెరవేర్చి ప్రజలు మనోభావాలు అనుగుణంగా మంచి ప్రజాపాలన అందిస్తామని అన్నారు.

పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ఎండి యం.శివప్రసాదు,మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠలరావు,మాజీ శాసనసభ్యులు ఘంటా మురళీ రామకృష్ణ,కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here