పూర్తిస్థాయిలో గుడివాడ అభివృద్ధి చెందే వరకు నాకు సంతృప్తి ఉండదు: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
గుడివాడలో రెపరెపలాడిన పసుపు జెండా….
ఘనంగా టిడిపి తొలి ఏడాది విజయోత్సవాలు… గుడివాడలో పండగ వాతావరణం
ఉత్సవంలా జరిగిన విజయోత్సవ బైక్ ర్యాలీలో…. వేలాదిగా పాల్గొన్న కూటమి శ్రేణులు
చిన్నపాటి స్టెప్పులు వేస్తూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచిన ఎమ్మెల్యే రాము….
గుడివాడలో రామరాజ్యం ప్రారంభమై ఏడాది పూర్తి…..
కూటమి శ్రేణులందరికీ మొదటి ఏడాది విజయోత్సవ శుభాకాంక్షలు:ఎమ్మెల్యే రాము
గుడివాడ జూన్12:కూటమి ప్రభుత్వ హయంలో గడిచిన ఏడాదికాలంగా అనేక అభివృద్ధి పనులు జరిగాయని…. పూర్తిస్థాయిలో గుడివాడను అభివృద్ధి చేసే వరకు నాకు సంతృప్తి ఉండదని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడలో అరాచక వాదం అంతమొంది ప్రారంభమైన రామరాజ్యానికి ఏడాది పూర్తయిందన్నారు.
ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ మొదటి ఏడాది విజయోత్సవ వేడుకలు గుడివాడ పట్టణంలో గురువారం ఘనంగా జరిగాయి.
అంబరాన్ని అంటేలా జరిగిన విజయోత్సవ సంబరాల్లో పార్టీ నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో నియోజకవర్గ పరిధిలోని కూటమి పార్టీల శ్రేణులు వేలాదిగా పాల్గొన్నారు. టిడిపి కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని పలు ప్రధాన ప్రాంతాల గుండా ఎన్టీఆర్ స్టేడియం వరకు చేరుకుంది. ర్యాలీ ఆసాంతం యువత, కూటమి శ్రేణులు జై వెనిగండ్ల, జై పవన్ కళ్యాణ్,జై జై చంద్రబాబు నినాదాలతో హోరెత్తించారు.
పార్టీ పాటలకు చిన్నపాటి స్టెప్పులు వేస్తూ ర్యాలీలో సందడి చేసిన ఎమ్మెల్యే రాము కూటమి శ్రేణులను ఉత్సాహపరిచారు.
స్టేడియం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే రాము…. కూటమి నేతలతో కలిసి విజయోత్సవ భారీ కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు తినిపించారు.
అనంతరం పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఎమ్మెల్యే రాము మాట్లాడారు….కూటమీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా అందరికీ ఆయన శుభాకాంక్షలు చెప్పారు. కూటమి శ్రేణుల సహకారం, నియోజకవర్గ ప్రజల మద్దతుతో గుడివాడలో అరాచకా పాలన అంతం చేసి రామరాజ్యాన్ని ప్రారంభమై నేటికీ ఏడాది పూర్తయిందన్నారు. ఐదేళ్ల అరాచకాన్ని తట్టుకోని నిలబడిన శ్రేణులకు ఎమ్మెల్యే రాము అభినందనలు తెలియజేశారు.
గడిచిన ఏడాదికాలంగా నియోజకవర్గ వ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ముఖ్యంగా ప్రజలకు మంచి జరుగుతుందనుకునే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లామన్నారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధాని మోడీ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలోకి ముందుకు సాగుతుందన్నారు. సూపర్ సిక్స్ హామీలన్నీ ఒడి ఒడిగా అమలు అవుతున్నాయని, నేడు అమ్మ ఒడి, రేపు ఉచిత బస్సు పథకం కూడా ప్రారంభం అవుతుందని ఎమ్మెల్యే రాము అన్నారు.
విజయోత్సవ వేడుకల్లో మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, జిల్లా బిజెపి అధ్యక్షుడు గుత్తికొండ శ్రీ రాజబాబు, జనసేన పార్టీ ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, గుడివాడ, నందివాడ, రూరల్ మండలాల టిడిపి అధ్యక్షులు దింట్యాల రాంబాబు, దానేటి సన్యాసిరావు, వాసే మురళి, గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవి కుమార్, గుడ్లవల్లేరు చైర్మన్ పొట్లూరి రవి, సీనియర్ టిడిపి నాయకులు పిన్నమనేని బాబ్జి, లింగం ప్రసాద్, డాక్టర్ గోర్జి సత్యనారాయణ, చేకూరు జగన్ మోహన్ రావు, గుడివాడ జోన్స్, గుడివాడ జనసేన అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు దండమూడి చౌదరి,టిడిపి నాయకులు పండ్రాజు సాంబయ్య, రెడ్డి షణ్ముఖ, పోలాసి ఉమయ్య, షేక్ జానీ, లోయ శివాజీ, నిమ్మగడ్డ సత్య సాయి, కడియాల గణేష్, గోవాడ శివ, పంచకర్ల మహేష్, మచిలీపట్నం పార్లమెంటు బిజెపి నాయకులు సురే గాంధీ, జనసేన జిల్లా నాయకులు సందు పవన్,కొదమల గంగాధర్, సాయన రాజేష్, పేర్ని జగన్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ సుబ్బారావు, తెలుగు మహిళా నేతలు కొల్లి రమ్య, మాదాల సునీత, సిరిపురపు తులసీరాణి, మరిదు రోహిణి , మెటోర, జయశ్రీ, యార్లగడ్డ సుధారాణి, పొట్లూరి రమాదేవి మల్లికా బేగం, అస్మా, గుడివాడ నియోజకవర్గ పరిధిలోని కూటమి పార్టీల శ్రేణులు, వెనిగండ్ల రాము అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.