పూర్ణహుతి కార్యక్రమంలో ఈవో శీనా నాయక్ భవంగా వారాహి నవరాత్రి ఉత్సవాలు
పూర్ణాహుతితో ముగింపు
విజయవాడ, దుర్గ గుడి జూలై 4.
అమ్మవారి సన్నిధిలో వారాహి నవరాత్రి ఉత్సవాలు పూర్ణాహుతి కార్యక్రమంతో శుక్రవారం ముగి సాయి.
శుక్రవారం ఉదయము “పూర్ణాహుతి” కార్యక్రమముతో వారాహి నవరాత్రి ఉత్సవములు పరి సమాప్తి అయినవి.
శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఆషాడ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాడ అమావాస్య వరకు అనగా .26 వ తేదీ గురువారం నుంచి జూలై 24 గురువారం వరకు నెల రోజుల పాటు ఆషాఢ మాసము. ఈ మాసము లో వారాహి నవరాత్రుల పుణ్య మాసము అని పురాణముల ద్వారా తెలియపరిచియున్నందున, సదరు మాసములో భక్తులు శ్రీ అమ్మవారికి సారెను సమర్పించుట వలన భక్తులకు శ్రేయస్కరమని
తెలియజేస్తూ
ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం వివిధ దేవాలయములు, ధార్మిక సంస్థలు, భక్త సమాజముల వారిచే శ్రీ అమ్మవారికి ఆషాడం సారె సమర్పణ కార్యకమమును నిర్వహిస్తూ వస్తున్నారు.
శ్రీ వారాహి మాతను సప్త మాతృకలలో దశ మహావిద్యలలో ఒకరిగా కొలుస్తారు.
శ్రీ వారాహి అమ్మవారిని పూజించుట వలన శత్రువులను నాశనం చేయడం ద్వారా భక్తుడిని ఆశీర్వదిస్తుంది, ప్రతికూలత, చెడు కన్ను, అనారోగ్యం, ప్రమాదాలు చెడు కర్మల నుంచి
ఉపశమనం లభిస్తుందని పండితులు తెలిపారు.
శ్రీ అమ్మవారిని సస్య దేవతగా చెప్పబడుచున్నదని పండితుల పేర్కొన్నారు . అట్టి శ్రీ వారాహి అమ్మవారిని పూజించుట ద్వారా సకాలములో పంటలు సమృద్ధిగా పండి రైతులు భక్తులు సుఖ సంతోషములతో వర్ధిల్లెదరని పురాణముల ద్వారా తెలియవచ్చుచున్నది.
కావున, లోక కళ్యాణార్ధం యాగశాల నందు పంచ వారాహి మంత్రములతో శ్రీ అమ్మవారి జప, తర్పణ, హోమములు ఇతర వైదిక కార్యక్రమములు నిర్వహించుటకు వైదిక కమిటీ వారి సూచనల మేరకు నిర్ణయించడమైనది. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ దశమి వరకు అనగా జూన్.26 వ తేదీ గురువారం నుంచి జూలై 4 శుక్రవారం వరకు శ్రీ అమ్మవారికి పంచ వారాహి మంత్రములతో జపములు, హోమములు (యాగశాల నందు) ప్రతీరోజు ఉదయము నుంచి సాయంత్రం వరకు జప, తర్పణ, హోమములు. పై వైదిక కార్యక్రమములు శాస్త్రోక్తముగా, ఆగమానుసారం దేవస్థాన అర్చకులచే మాత్రమే ఏకాంత సేవలుగా (భక్తుల పరోక్షమున) నిర్వహించబడినవి. శుక్రవారం ఉదయము యాగశాల లో ఆలయ ఈవో వి.కె.శీనా నాయక్, వైదికమిటీ, వేద పఁడితులు, అర్చకస్వాములు శాస్త్రోక్తముగా, ఆగమానుసారం “పూర్ణాహుతి” కార్యక్రమముతో ముగిఁపు పలికినారు. వారాహి నవరాత్రి ఉత్సవముల ఎంతో వైభవంగా నిర్వహించి పరి సమాప్తి అయినవి అని ఆలయ అర్చక స్వాములు తెలియజేశారు.