
పునరావాస కేంద్రాలలో పర్యటించిన మంత్రి సత్య కుమార్ యాదవ్.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పునరావాస కేంద్రాలను ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యాన చంద్ర , ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ప్రభుత్వ అధికారులతో
కలిసి పర్యటించారు..
పశ్చిమ నియోజకవర్గం కె.ఎల్ రావు నగర్, రాకేష్ పబ్లిక్ స్కూల్ నందు ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాన్ని కూటమినేతలతో కలిసి పరిశీలించారు..
విశ్రాంతి పొందుతున్న ప్రజలతో మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడారు.
పునరావాస కేంద్రాల్లో అందిస్తున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.
ప్రజలెవరు ఆందోళన చెందనవసరం లేదని… కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.
కేంద్రాల్లో ఉంటున్న వారికి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. మంత్రి స్వయంగా ఆహారాన్ని పంపిణీ చేశారు
![]()
