పునరావస కేంద్రాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే కార్యాలయకార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్

Spread the love

పునరావస కేంద్రాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే కార్యాలయ
కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్

మొంథా తుఫాన్‌ నేపద్యంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో పశ్చిమలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలను పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ , కూటమినేతలతో కలిసి పరిశీలించారు.

చిట్టినగర్ రాకేష్ పబ్లిక్ స్కూల్ , తేలప్రోలు రాజా హై స్కూల్, కొండ బడి తదితర ప్రాంతాలలో ఏర్పాటుచేసిన పునరావస కేంద్రాలను పరిశీలించి విశ్రాంతి తీసుకుంటున్న ప్రజలతో మాట్లాడారు.

వారికి అందుతున్న వసతి సౌకర్యాలు, ఆహారం, త్రాగునీరు, మెడికల్ సౌకర్యాలను గురించి అడిగి తెలుసుకున్నారు.

ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగం , ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది,సుజనా మిత్ర కోఆర్డినేటర్లు , కూటమి నేతలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారన్నారు. ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం సంభవించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు..

ఈ పర్యటనలో ఎన్డీఏ కూటమి నేతలు మైలవరపు దుర్గారావు ,మంగళపురి మహేష్, గడ్డిపాటి కిరణ్,వేంపలి గౌరీ శంకర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఆనంద్ కృపాల్, శ్రీనివాసరావు, సుజనా మిత్ర కోఆర్డినేటర్లు దొడ్ల రాజా, కొల్లి దుర్గారావు, తిరుపతి రెడ్డి, సప్పా శ్రీనివాస్, యలమంచిలి ఫణీంద్ర, పుప్పాల భవాని , శివకుమారి తదితరులు పాల్గొన్నారు..

Loading