పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని సందర్శించిన మంత్రి లోకేష్ సీఎం చంద్రబాబుతో కలిసి శ్రీ భగవాన్

1
0

పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని సందర్శించిన మంత్రి లోకేష్

సీఎం చంద్రబాబుతో కలిసి శ్రీ భగవాన్ సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్న మంత్రి

పుట్టపర్తిః కొత్తచెరువులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో మెగా పీటీఎం 2.0 అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తో కలిసి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని సందర్శించారు. సాయికుల్వంత్ మందిరంలోని శ్రీ భగవాన్ సత్యసాయి బాబా మహాసమాధిని ముఖ్యమంత్రి చంద్రబాబు తో కలిసి దర్శించుకున్నారు. ప్రార్థనలు చేశారు. అనంతరం ఓంకార్ మందిరంలో కొద్దిసేపు గడిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ తో పాటు మంత్రి కె.అచ్చెన్నాయుడు, ఎంపీ బీకే పార్థసారథి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యే పల్లె సింధూరా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు శాంతిభవన్ అతిథిగృహంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను మంత్రి లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here