పిఆర్సి కమిటీని వెంటనే నియమించండి పెండింగ్ డిఏలు మంజూరు చేయాలి
ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి
- చీఫ్ సెక్రటరీ ను కలిసిన APJAC నాయకులు*
వెలగపూడి సచివాలయంలో నూతన ఎన్జీజివో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మరియు ఎపి జేఏసి చైర్మన్ ఎ . విద్యాసాగర్ సెక్రెటరీ జనరల్ కే ఎస్ ఎస్ ప్రసాద్ (APUTF) ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాల నేతలు సోమవారం వెలగపూడి సచివాలయం లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, ను మర్యాదపూర్వకంగా కలిసి ఉద్యోగుల సమస్యలపై చర్చించారు.
ఉద్యోగులకు సంబంధించిన పి ఆర్ సి కమిటీని వెంటనే నియమించాలని, రెండు సంవత్సరాలకు పైగా కాలాతీతం అయినందున వేతన సవరణ కమిషను వెంటనే నియమించి వేతన సవరణ ప్రక్రియని ప్రారంభించాలని కోరారు.
ఉద్యోగులకు సంబంధించి మూడు డి ఏ లు పెండింగ్ ఉన్నాయని కనీసం రెండు డి ఎ లు అయినా మంజూరు చేయాలని కోరారు. ఉద్యోగుల సరెండర్ లీవ్ బకాయిలు తదితర వాటి మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులపై 2019 24 సంవత్సరాల మధ్య వివిధ ఆందోళనలో నమోదైన పెండింగ్ కేసులన్నీ ఎత్తివేయాలని, ఇంటీరియమ్ రిలీఫ్ చెల్లించాలని,ఉద్యోగుల సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాప్ కౌన్సిల్ మీటింగు చీఫ్ సెక్రటరీ చైర్మన్గా త్వరలోనే ఏర్పాటు చేయాలని, దానికి సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభమైంది అన్న విషయాన్ని JAC సంఘాల నేతలు చీఫ్ సెక్రెటరీ గారికి తెలియజేశారు.
పబ్లిక్ సెక్టార్ గురుకుల ఉద్యోగులకు 60 నుంచి 62 సంవత్సరాల పదవీ విరమణ వయస్సు పెంపు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, పెన్షనర్లకు సంబంధించిన అడిషనల్ కౌంటం పునరుద్ధరణ, 2004 ముందు నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉద్యోగులకు ఓపిఎస్ వర్తింపు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తించాలని, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు తదితర అంశాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
పిఆర్సి కమిటీ ఏర్పాటు, డి ఎ మరియు బకాయిలు చెల్లింపు అంశాలలో ఉద్యోగుల్లో ఉన్న ఆందోళన చీఫ్ సెక్రటరీగా దృష్టికి విద్యాసాగర్ తీసుకుని వచ్చారు.
ఉద్యోగుల హెల్త్ కార్డుల విషయంలో EHS మేనేజ్మెంట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారని, సెక్రటరీ అధ్యక్షతన జరగవలసిన EHS స్టీరింగ్ కమిటీ మీటింగ్ ని కూడా ఏర్పాటు చేయాలని కోరారు. హెల్త్ కార్డులు సమర్థ నిర్వహణకు గాను తీసుకోవలసిన కొన్ని నిర్ణయాలను ఈహెచ్ ఎస్ స్టీరింగ్ కమిటీలో తీసుకొనవలసిన అవసరం ఉన్నదన్న విషయాన్ని జేఏసీ నేతలు చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకుని వచ్చారు.
జేఏసీ నాయకులతో చీఫ్ సెక్రటరీ విజయానంద్ మాట్లాడుతూ జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయటానికి ముందు కార్యాచరణ జరుగుతుందని, డిపార్ట్మెంట్ జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేశామని, ఉద్యోగులకు ఒకరోజు గ్రీవెన్స్ డే ని అమలుపరచమని ఉత్తర్వులు ఇచ్చామని, నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత 7500 కోట్ల రూపాయల్ని బకాయిల కింద చెల్లించామని, మిగిలిన అన్ని విషయాలను ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకుని వెళ్లి దశలవారీగా పరిష్కరిస్తామని, ఉద్యోగుల సంక్షేమo విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో బాధ్యతగా ఉంటుందని తెలిపారు. నూతనముగా ఏపీ ఎన్జీజివో సంఘ అధ్యక్షుడిగా మరియు ఏపీ జెఎసి చైర్మన్గా ఎన్నికైన ఏ. విద్యాసాగర్ ను, రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన డివి రమణను అభినందించారు.
ఈరోజు వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో.. చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ ని కలిసిన వారిలో రాష్ట్ర జె ఏ సి చైర్మన్ అలపర్తి విద్యా సాగర్ సెక్రెటరీ జనరల్ కె ఎస్ ప్రసాద్,ఏపి యు టీ ఎఫ్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ డి వి రమణ..కో. చైర్మన్. జి హృదయ రాజు, ఏపి టి ఎఫ్ చెన్నుపాటి మంజుల..N. చంద్రశేఖర్.. వైస్ ఛైర్మన్ చోడగిరి శ్రీనివాస్, ఇరిగేషన్. సి పి ఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.సి ఎం దాస్..అసిస్టెంట్ సెక్రెటరీ జనరల్ ఆర్ ఎస్.హరనాధ్, గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు జానీ పాషా.. పశుసంవర్ధక శాఖ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ సేవా నాయక్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్చంద్రశేఖర్
RTC NMU రాష్ట్ర సంయుక్త కార్యదర్శి S. రాజేష్ కుమార్,,పశ్చిమగోదావరి జిల్లా జె ఏ సి కన్వీనర్ నెరుసు రామారావు.. రాష్ట్ర NGGOs అసోసియేషన్ ప్రచార కార్యదర్శి జానకి.. విజయనగరం జిల్లా సహాధ్యక్షుడు కిషోర్.. AISGEF కన్వీనర్ రాజ్యలక్ష్మి.. విజయవాడ నగర శాఖ అధ్యక్షుడు Ch. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు..