పాలక బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న మతతత్వ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా దేశంలోని వామపక్ష బహుజన లౌకిక శక్తులు ఏకం కావాలని మార్క్సిస్టు ఆలోచనా పరుల వేదిక ఆద్వర్యంలో

2
0

గాంధీనగర్ 27.6 2025

వామపక్ష బహుజన లౌకిక శక్తులు ఏకం కావాలి

మార్క్సిస్టు ఆలోచనా పరుల వేదిక

పాలక బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న మతతత్వ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా దేశంలోని వామపక్ష బహుజన లౌకిక శక్తులు ఏకం కావాలని మార్క్సిస్టు ఆలోచనా పరుల వేదిక ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు అభిప్రాయ పడ్డారు.
సిపిఐ, సిపిఎం, ఎమ్ ఎల్ పార్టీల రాష్ర్ట నాయకులు పాల్గొన్నారు.
అధ్యక్షత వహించిన వేదిక కన్వీనర్
ఏ ఎన్ యూ విశ్రాంత ఆచార్యులు అబ్దుల్ నూర్ భాషా మాట్లాడుతూ భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం జరిగి వందేళ్లు అయిందని ఉద్యమాలు చీలకల నేపథ్యంలో మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని , ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే సామ్రాజ్యవాద, నయా ఉదారవాద ఆర్థిక విధానాలు అవలంబిస్తున్న వారేనని, ఎన్నికల సమయంలో ఏదో ఒక పార్టీలతో పొత్తు కాకుండా బెంగాల్, కేరళ, త్రిపుర వంటి రాష్ట్రాల్లో మాదిరిగా
తెలుగు రాష్ట్రాల్లో కూడా బిజెపి, కాంగ్రెస్ వంటి పాలక పార్టీలకు ప్రత్యామ్నాయంగా లెఫ్ట్ ఫ్రంట్ గా ఏర్పడి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తుల పునరేకీకరణకు సిపిఐ మొదటి నుండి కట్టుబడి ఉన్నామని భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వందేళ్లు పూర్తి అవుతున్న తరుణంలో ఈ ఏడాది ఆగస్టు లో సిపిఐ రాష్ర్ట మహాసభలు ఒంగోలులో జాతీయ మహాసభలు అక్టోబర్ లో చండీఘర్ లో జరుగనున్నాయని, గడచిన పదకొండు ఏళ్లలో మేధావులు ప్రశ్నించే వారిపై నిర్బంధాలు అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారని, పోరాడి సాధించుకున్న హక్కుల్ని కాలరాస్తూ ఉన్నారని, మతం పేరుతో విభేదాలు ఉన్మాదాలు రెచ్చగొడుతూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చిగురుపాటి బాబురావు మాట్లాడుతూ పాలక బిజెపి తన ఆరెస్సెస్ అజెండానే అమలు చేస్తున్నారని, ఈక్రమంలో ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పరంగా ఎదుర్కోవాలని అన్నారు .
రాష్ట్రంలో ఒక రకంగా కూటమి రూపంలో బిజెపి పాలవ సాగిస్తూ ఉందని, పవన్ కళ్యాణ్ వంటి వారిని అడ్డం పెట్టుకుని మత రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. యోగాడే పేరుతో మత అజెండా ను ముందుకు తీసుకువచ్చారని అన్నారు. కార్మిక రైతాంగ సమస్యల మీద వామపక్ష శక్తులు అందరూ కలిసే ముందుకు వెళ్తున్నామని అన్నారు. వెంకట రెడ్డి (ఎమ్ సిపిఐ ) మన్నవ హరి ప్రసాద్ ( రెడ్ ఫ్లాగ్ )
కే పోల్సరి,( న్యూ డెమోక్రసీ) డి స్వామి
సుధీర్ బాబు ఎస్ యూ సి ఐ) పి కోటేశ్వరరావు (ప్రజా పోరు) చర్చల్లో పాల్గొన్నారు. పహెల్గంలో అమాయక పర్యాటకుల్ని దారుణంగా చంపిన ఘటనలో ఉగ్రవాదుల్ని పట్టుకోవడంలో విఫలం అయ్యారని అన్నారు.
మార్క్సిస్టు ఆలోచన వేదిక కో కన్వీనర్ చిగురుపాటి భాస్కరరావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఈ దేశంలో వామపక్ష లౌకిక శక్తులే ప్రత్యామ్నాయం అని కమ్యూనిస్టులు ఒక్కటిగా అవ్వాలని ప్రజలు అందరూ భావిస్తూ ఉన్నారని ఆ దిశగా ప్రయత్నం చేయడమే ఈ వేదిక లక్ష్యం అని, ఏదో ఎన్నికల సమయంలో పొత్తులు పెట్టుకోవడం కాదు ,ముందు నుండే బలమైన ఉద్యమాలు ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని
అన్నారు. వేదిక ప్రతినిధులు బండ్ల శ్రీనివాస్, చంద్రశేఖర్, మోతుకూరి అరుణకుమార్, నేలమాటి లక్ష్మణరావు, మార్పు శరత్, ఎస్ ఆర్ వేమన తదితరులు నేతృత్వం వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here