పారిశ్రామికాభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉంది*యువ పారిశ్రామికవేత్తలకు గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు పిలుపు

Spread the love

 పారిశ్రామికాభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉంది*యువ పారిశ్రామికవేత్తలకు గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు పిలుపు

పరిశ్రమల స్థాపనకు యువ పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి

మల్లవల్లిలో కొత్త పరిశ్రమల స్థాపనపై దృష్టి పెట్టి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రధాన ఎజెండా

యువ పారిశ్రామికవేత్తలకు గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు పిలుపు

పారిశ్రామిక అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. బాపులపాడు మండలం, మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ కు సంబంధించిన దాదాపు 24 మంది వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు ఈ రోజు ఉదయం గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావుతో ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈసందర్భంగా వారు గత 5 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగ తక్షణమే స్పందించి ఎపిఐఐసి మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ జోనల్ మేనేజర్ తో ఫోన్లో మాట్లాడి ఆయా సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరారు. అలాగే పోలీసు ఉన్నతాదికారులతో మాట్లాడి మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో పటిష్టమైన పోలీసు భద్రతను ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. మిగిలిన సమస్యలను తప్పకుండా త్వరలోనే పరిష్కరిస్తామని పారిశ్రామికవేత్తలకు భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాది అవకాశాల కల్పనలో భాగంగా పరిశ్రమలు స్ధాపించే వారికి ప్రాధాన్యతనిచ్చి పారిశ్రామికవేత్తలకు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. ప్రశాంత వాతావరణంలో, నాణ్యతను పాటిస్తూ, సులభంగా వ్యాపారాలు చేసుకొనే పరిస్ధితులు నెలకొల్పుతామని హామీ ఇచ్చారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *