ఎన్‌టిఆర్ జిల్లా తేది:30.07.2025
పారదర్శకమైన సేవలతో రవాణాశాఖ ప్రతిష్టతను పెంచుదాం..
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాం..
ఆర్‌జెటిసి డా.వడ్డే సుందర్.
వాహన యాజమానులు చోదకులకు పారదర్శకమైన సేవలందించి రవాణాశాఖ ప్రతిష్టను మరింత ఇనుమడిరపచేందుకు అధికారులు సిబ్బంది కృషి చేయాలని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంతో పాటు పదోన్నతల పై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటానని రవాణాశాఖ జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమీషనర్ డా. వడ్డే సుందర్ తెలిపారు.
రవాణాశాఖ జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమీషనర్‌గా పదవీ భాధ్యతలు చేపట్టిన డా. వడ్డే సుందర్ బుధవారం తొలి సారి విజయవాడ జిల్లా రవాణాశాఖ కార్యాలయాన్ని సందర్శించి, ప్రజలకు అందిస్తున్న సేవలను సిబ్బంది నుండి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆర్‌జెటిసి డా.వడ్డే సుందర్ మాట్లాడుతూ రవాణాశాఖ ద్వారా వాహన యాజమానులు, డ్రైవర్లకు ప్రభుత్వ పరంగా అందించే సేవలలో అంత్యంత పారదర్శకత పాటించడం ద్వారా శాఖ ప్రతిష్టను పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రవాణాశాఖ వాహన సారధి పోర్టల్ ద్వారా సేవలందించడంలో ఎదురైయ్యే సాంకేతిక సమస్యలను అందిగమించేందుకు ఎప్పటికప్పుడు అంధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. వాహన సారధి పోర్టల్ నిర్వహణ మరింత సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. రవాణాశాఖలో జూనియర్ అసిసెంట్ నుండి సీనియర్ అసిసెంట్లుగా, కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్ పదోన్నతలపై త్వరలో నిర్ణయం తీసుకుని పదోన్నతలు కల్పిస్తామన్నారు. ప్రజల నుండి స్వీకరించిన ఆర్జీలను నిర్థేశించిన సమయానికి పరిష్కరించి నివేధికలు సమర్పించాలని, డాష్ బోర్డు నందు పెండిరగ్ లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆయన ఉన్నతాధికారులకు సూచించారు.
కార్యాలయ సందర్శనకు విచ్చేసిన ఆర్‌జెటిసి డా. వడ్డే సందర్‌కు ఆర్‌టివోలు ఆర్. ప్రవీణ్, కె. వెంకటేశ్వరరావు, రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షులు ఎం. రాజుబాబు, కార్యదర్శి కె.వి.వి నాగ మురళి, కార్యాలయ పరిపాలన అధికారులు సత్యనారాయణ, అబ్దుల్ సత్తార్, చంద్రకళ, సిబ్బంది స్వాగతం పలికి సన్మానించారు.