పాత రాజ‌రాజేశ్వ‌రిపేట‌లో ఘ‌నంగా పీర్ల మ‌హోత్స‌వం

3
0

పాత రాజ‌రాజేశ్వ‌రిపేట‌లో ఘ‌నంగా పీర్ల మ‌హోత్స‌వం

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌ హజరత్ ఖుని అలం పీర్ల మహోత్స‌వాలు ఖాదరి నవ జవాన్ కమిటీ ఆధ్వర్యంలో ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలోని పాత రాజరాజేశ్వ‌రీపేట‌లో గురువారం సాయంత్రం ఘ‌నంగా జ‌రిగాయి. కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ ట్రేడ‌ర్ క‌మిటీ అఫిషియ‌ల్ స్పోక్స్ ప‌ర్స‌న్ ధ‌నేకుల వెంక‌ట హ‌రికృష్ణ‌(నాని) పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా పీర్ల మ‌హోత్స‌వం ముగింపు కార్య‌క్ర‌మంలో ఏర్పాటు చేసిన నిప్పుల గుండాన్ని ధ‌నేకుల నాని వెలిగించి ప్రారంభించారు. కార్య‌క్ర‌మంలో తెలుగుదేశం పార్టీ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం బిసి సెల్ ఉపాధ్య‌క్షుడు తిల‌క్ రామ్‌సింగ్, షేక్ బాజీ, షేక్ కరీముల్లా, నవజవాన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా పీర్ల పంజాలో ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు నిర్వ‌హించి అనంత‌రం ధ‌నేకుల వెంక‌ట హ‌రికృష్ణ‌(నాని), తిల‌క్ రామ్‌సింగ్‌ను నిర్వాహ‌కులు సాంప్ర‌దాయం ప్ర‌కారం ఘ‌నంగా స‌త్క‌రించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here