28-6-2025
పాఠశాల అభివృద్ధికి MLA బొండా ఉమా ఎంతగానో సహాయపడుతున్నారు
విద్యార్థుల భవిష్యత్తు – మా బాధ్యత -MLA బొండా ఉమ
ధి:-28-6-2025 శనివారం అనగా ఈరోజు సాయంత్రం 4:30″గం లకు ” సెంట్రల్ నియోజకవర్గం లోని 62వ డివిజన్ పుచ్చలపల్లి సుందరయ్య స్కూల్ నందు డాక్టర్. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కార్యక్రమం లో భాగంగా 10వ తరగతి విద్యార్థిని-విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, స్కూల్ బ్యాగులు పుస్తకాలు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు
ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ:- “విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తోందని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని, ఉపాధ్యాయులు తమ సొంత పిల్లలు వలె శ్రద్ధ తీసుకుని బోధన చేస్తున్నారని, అందుకే ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నాయని
విజయవాడలోని సత్యనారాయణ పురం AKTP స్కూల్ విద్యార్థి 593 మార్కులతో నెంబర్ వన్ స్థానం సాధించారు అని, ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో విద్యా సదుపాయాలు అందిస్తున్నామని, యూనిఫాం, బ్యాగులు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనంతో పాటు పోషకాహారాన్ని కూడా అందిస్తున్నామని
గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి ద్వారా ఒక్క పిల్లవాడికి మాత్రమే ₹13,000 ఇచ్చారని, NDA కూటమి ప్రభుత్వం అయితే పిల్లల సంఖ్యను బట్టి తల్లికి వందనం పేరుతో ఇద్దరు పిల్లలు ఉంటే ₹26,000, ముగ్గురు ఉంటే ₹39,000, నలుగురు ఉంటే ₹52,000 ఇవ్వడం జరిగిందని, పిల్లల విద్యకు సంబంధించిన ఖర్చులో వెనుకాడకుండా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలియజేసారు
ఈ కార్యక్రమంలో:- డివిజన్ ఇంచార్జ్ పైడి శ్రీను, ప్రధాన కార్యదర్శి మరియు బాబు, క్లస్టర్ కో కన్వీనర్ తొట్టెంపూడి ఉదయ్ శంకర్, సాయి, జటాధర్, చక్క సుబ్బారావు, సీనియర్ నాయకురాలు వెంకాయమ్మ, వరలక్ష్మి, మేరీ తదితరులు పాల్గొన్నారు