తేది: 06.06.2025కావలి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా*పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన మధుసూదన్ కుటుంబానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా రూ.50 లక్షల ఆర్థిక సాయం కావలిలో మధుసూదన్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పి స్వయంగా చెక్కు అందజేసిన మంత్రి కందుల దుర్గేష్**మధుసూదన్ కూతురుకి, కొడుకుకి చెరో రూ.22.50 లక్షలు, తల్లిదండ్రులకు రూ. 5 లక్షలు అందజేత**మధుసూదన్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ..జనసేనాని పవన్ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని వెల్లడి**మధుసూదన్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించిన మంత్రి దుర్గేష్*శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు: మే నెలలో జమ్ముకశ్మీర్ లో విహారయాత్రకు వెళ్లి పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మధుసూదన్ రావు కుటుంబాన్ని పరామర్శించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనల మేరకు వ్యక్తిగతంగా రూ.50 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.శుక్రవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి వెళ్లిన మంత్రి కందుల దుర్గేష్, టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ్ లు కలిసి మధుసూదన్ కుటుంబీకులను కలిశారు. ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తామని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మధుసూదన్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. కష్టాల్లో ఉన్న కుటుంబానికి జనసేన అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా 8వ తరగతి చదువుతున్న మధుసూదన్ కొడుకుకి రూ.22.50 లక్షలు, ఇంటర్మీడియట్ చదువుతున్న కూతురుకి రూ.22.50 లక్షలు, ఆయన తల్లిదండ్రులకు రూ. 5 లక్షలు ఆర్థికసాయం ప్రకటించగా తాము నేరుగా అందజేయడం జరిగిందని మంత్రి దుర్గేష్ వెల్లడించారు.ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నాడు ఈ ఘటన తెలిసిన వెంటనే డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ చలించిపోయారని తెలిపారు. ఈ క్రమంలో మధుసూదన్ కుటుంబాన్ని ఆదుకోవాలని తమ నాయకుడు పవన్ కళ్యాణ్ నిర్ణయించిన నేపథ్యంలో తాము కావలికి వచ్చి స్వయంగా కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సహాయ సహకారాలు ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు.నరనరాల్లో దేశభక్తి నిండిన వ్యక్తి, నిజమైన మానవతావాది పవన్ కళ్యాణ్ అని మంత్రి దుర్గేష్ అన్నారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే సాయం చేసేందుకు వెనకాడని మనస్తత్వం తమ అధినేత పవన్ కళ్యాణ్ ది అన్నారు. ఇప్పటికే ఇబ్బందిపడుతున్న రైతులకు, ఆత్మహత్య చేసుకున్న రైతులకు లక్ష రూపాయల చొప్పున సాయం చేసిన తమ నాయకుడు పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఉగ్రవాదుల దాడిలో అన్యాయంగా బలైన మధుసూదన్ కుటుంబాన్ని నిలబెట్టాలని నిర్ణయించి వ్యక్తిగతంగా ఆర్థిక సాయం అందించినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. తండ్రి లేడు, ఇంటికి పెద్ద దిక్కు లేడన్న బాధ చిన్నారులకు కలగకుండా ఎల్లవేళలా ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. చిన్న కార్యకర్త మొదలుకొని రాష్ట్రస్థాయి నాయకుల వరకు సైతం ఏ సహకారం కావాలన్నా పార్టీ తరపున అండదండలుగా నిలబడతామన్న ధైర్యాన్ని మంత్రి దుర్గేష్ కల్పించారు.