పశ్చిమ లో ఘనంగామెగా పేరెంట్ టీచర్ మీట్ కూటమి నేతలతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శిప్రత్తిపాటి శ్రీధర్

1
0

పశ్చిమ లో ఘనంగా
మెగా పేరెంట్ టీచర్ మీట్

కూటమి నేతలతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి
ప్రత్తిపాటి శ్రీధర్

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా పేరెంట్- టీచర్ మీట్ కు విశేష స్పందన లభించింది.

పశ్చిమ నియోజకవర్గంలోని గాంధీజీ మున్సిపల్ హైస్కూల్, మౌలానా ఆజాద్ ఉర్దూ మున్సిపల్ హై స్కూల్, విద్యాధరపురం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్ టీచర్ మీట్ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కార్పొరేటర్లు , ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి పాల్గొన్నారు..

ప్రైవేట్ కు దీటుగా గాంధీజీ మున్సిపల్ హై స్కూల్

మెగా పేరెంట్ టీచర్ మీట్ లో
హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు
కే మల్లికార్జున రెడ్డి

వన్ టౌన్ లోని గాంధీజీ మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు
కే మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయులు
కే మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో పేరెంట్స్ ను భాగస్వాములు చేస్తూ కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు.
గాంధీజీ మున్సిపల్ హైస్కూల్లో మౌలిక వసతులు , విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తున్నామని విద్యార్థుల శాతం కూడా పెరిగిందన్నారు.
ఎమ్మెల్యే సుజనా చౌదరి సుజనా ఫౌండేషన్ ద్వారా పాఠశాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారని తెలిపారు. ప్రైవేట్ కి దీటుగా కార్పొరేట్ స్థాయి విద్యను ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా అందిస్తున్నామని తల్లిదండ్రులందరూ గమనించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చే దిశగా అడుగులు వేయాలన్నారు.

పాతబస్తీలోని మౌలానా ఆజాద్ ఉర్దూ మున్సిపల్ హై స్కూల్ లో మెగా పేరెంట్ టీచర్ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ , కార్పొరేటర్ మహాదేవు అప్పాజీరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

విద్యాసంస్కరణల దిశగా కూటమి ప్రభుత్వం
మహాదేవు అప్పాజీరావు కార్పోరేటర్

కార్పొరేటర్ మహాదేవు అప్పాజీరావు మాట్లాడుతూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించే ప్రయత్నంలో భాగంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ను నిర్వహిస్తోందని తెలిపారు. విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాసంస్కరణల దిశగా అడుగులు వేస్తున్నారని అన్నారు ప్రభుత్వం తమ నిర్ణయాల్లో తల్లితండ్రులను భాగస్వామ్యులను చేస్తూ వారి ఆలోచనలను పంచుకుంటూ వారి సూచనలతో ముందుకు వెళ్లాలని భావిస్తోందన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు తల్లిదండ్రుల సహకారంతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కే కళ్యాణి, టీచర్ రామకృష్ణ, కూటమి నేతలు అడ్డూరి భాస్కర్, పులి చేరి రమేష్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు..

విద్యాధరపురం , కబేళా ప్రాంతంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్ టీచర్ సమావేశాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
ప్రిన్సిపల్ హఫీజ్ షేక్ అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించిన
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ , టీడీపీ కార్పొరేటర్ మైలవరపు మాధురి లావణ్య, మాజీ కార్పొరేటర్ మైలవరపు కృష్ణ , బీజేపీ సీనియర్ నాయకులు దుర్భేశుల హుస్సేన్ , రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్ ఇక్బాల్ హుస్సేన్, వ్యాపారవేత్త అంజాద్ హుస్సేన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ప్రతిష్టాత్మకంగా మెగా పేరెంట్ టీచర్ మీట్
కార్పోరేటర్ మైలవరపు మాధురి లావణ్య

కార్పొరేటర్ మైలవరపు మాధురి లావణ్య మాట్లాడుతూ విద్యను ఆచరణలో పెడితేనే కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావించారని అందుకోసమే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించే ప్రయత్నంలో భాగంగా మెగా పేరెంట్ టీచర్ మీట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని తెలిపారు.
విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరచడానికి తల్లిదండ్రులతో కలిసి ఉపాధ్యాయులు పనిచేయడం , ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దటం కూటమి ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమన్నారు.
ఎమ్మెల్యే సుజనా చౌదరి సుజనా ఫౌండేషన్ ద్వారా పశ్చిమ లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ విద్యా రంగానికి తోడ్పాటునందిస్తున్నారని తెలిపారు.

కళాశాల ప్రిన్సిపల్ హఫీజ్ షేక్ అహ్మద్ మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే సుజనా చౌదరి, తమ సుజనా ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సహాయ సహకారాలువెలకట్టలేని అన్నారు . సుజనా విద్యన్నాపూర్ణ పథకం ద్వారా విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం అందిస్తున్నారని తెలిపారు.
ఇంటర్ ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. విద్యార్థిని విద్యార్థులు , తల్లిదండ్రులు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here