పశ్చిమ లో కేశినేని నాని, షేక్ ఆసిఫ్ ల ఎన్నికల ప్రచారం జనసంద్రంతో కిక్కిరిసిన రోడ్లు

Spread the love

 పశ్చిమ లో కేశినేని నాని, షేక్ ఆసిఫ్ ల ఎన్నికల ప్రచారం  జనసంద్రంతో కిక్కిరిసిన రోడ్లు

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, రథం సెంటర్ వద్ద నుంచి చిట్టినగర్ వరకు రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించిన 

విజయవాడ వైయస్సార్సీపీ పార్లమెంట్ అభ్యర్థి, ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)  మరియు పశ్చిమ నియోజకవర్గ  ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ షేక్ ఆసిఫ్ 

రోడ్ షో రథం సెంటర్ నుండి కాళేశ్వరరావు మార్కెట్ సామరంగం చౌక్ మీదుగా నెహ్రు బొమ్మ సెంటర్, ఆంజనేయ వాగు, చిట్టినగర్ వరకు సాగింది

నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి  వివిధ రాష్ట్రకార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా చైర్మన్లు.డైరెక్టర్లు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, అనుబంధ సంఘాలఅధ్యక్షులు , వైయస్సార్సీపీ కుటుంబ సభ్యులు.నాయకులు,  ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులు రోడ్ షో ర్యాలీ విజయోత్సవ ర్యాలీయా అన్నట్టు సాగింది

రోడ్ షోలో అడుగడుగునా ఎంపీ కేశినేని నాని కి, ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ కు నియోజకవర్గ ప్రజలు పూల వర్షం కురిపించారు అపూర్వ స్వాగతం పలికారు

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రోడ్ షో ను ముందుండి నడిపించారు

డప్పులు, డీజేల కోలహలం మధ్య యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని జై జగన్, జై కేశినేని నాని, జై షేక్ ఆసిఫ్ అనే నినాదాలతో రోడ్లన్నీ మారు మోగాయి జగనన్న సైన్యం నడుస్తుంటే ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెత్తాయి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేసిన.. షేక్ ఆసిఫ్

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *