పశ్చిమ లో అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి సుజనా ఫౌండేషన్ చేయూత
పశ్చిమ లోని అంగన్ వాడి కేంద్రాల రూపురేఖలను సమూలంగా మార్చి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు సుజనా ఫౌండేషన్ నడుం బిగించింది.
ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రిస్ప్ స్వచ్చంద సంస్థల సహకారంతో
అంగన్వాడీ కేంద్రాలను, ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయనున్నట్లు క్రిస్ప్ సభ్యులు మనీషా తెలిపారు.
భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం లోని అంగన్వాడీ కేంద్రాల్లో వసతులను కల్పించడం పిల్లలు, మహిళలకు మెరుగైన వైద్య సేవలు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని మనీషా తెలిపారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ సుజనా ఫౌండేషన్ సిబ్బంది, క్రిస్ప్ సభ్యులు పాల్గొన్నారు.