పశ్చిమ నియోజకవర్గ ఎన్డీయే కార్యాలయం 38వ డివిజన్ కొండ ప్రాంత బాధితులకు ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆర్థిక సాయం.

Spread the love

 21/7/2024

పశ్చిమ నియోజకవర్గ ఎన్డీయే కార్యాలయం

38వ డివిజన్ కొండ ప్రాంత బాధితులకు సుజనా చౌదరి ఆర్థిక సాయం.

హర్షం వ్యక్తం చేసిన బాధితులు 

38వ డివిజన్ కొట్టేటి కోటయ్య వీధి కొండ ప్రాంతంలో ఆదివారం ఉదయం కొండ చరియలు జారీ పడి పిళ్ళ తులసి అనే గృహిణి గాయాలు పాలైనది. విషయం తెలుసుకున్న పశ్చిమ బిజెపి ఎమ్మెల్యే యలమంచిలి సుజనా చౌదరి బాధితులకు అండగా నిలవాలని కోరారు.సుజనా చౌదరి ఆదేశాల మేరకు ఎన్డీయే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ తో కలిసి పిళ్ల తులసీ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. వర్షాల నేపథ్యంలో కొండప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కొండ ప్రాంత ప్రజల మౌలిక సదుపాయాల కల్పనె ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే కార్యాలయం తెలియజేసింది. తమకు ఆర్థిక సహాయం చేసిన పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో టిడిపి డివిజన్ అధ్యక్షురాలు పితాని పద్మ జనసేన డివిజన్ అధ్యక్షులు తమ్మిన లీలా కరుణాకర్ మాజీ కార్పొరేటర్ షేక్ కరీముల్లా సత్తార్ బాలకృష్ణ బిజెపి నాయకులు అవ్వారు బుల్లబ్బాయి ఎన్డీయే కూటమి నాయకులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *