పశ్చిమంలో భారీ బైక్ ర్యాలి జెండా ఊపి ప్రారంభించి రైడ్ చేసిన సుజనా

5
0


 పశ్చిమంలో భారీ బైక్ ర్యాలి 

జెండా ఊపి ప్రారంభించి రైడ్ 

చేసిన సుజనా

పశ్చిమ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ యువత భవానీ పురం లో బైక్ ర్యాలి నిర్వహించారు. సోమవారం సాయంత్రం భవానీ పురం స్వాతి సెంటర్ నుంచి ప్రారంభం అయిన ఈ ర్యాలి నీ సుజనా చౌదరి జెండా ఊపి ప్రారంభించారు. అంతే గాక సుజనా బుల్లెట్ నడిపి ర్యాలీ లో పాల్గొని యువత ను ఉత్సాహ పరచారు. సుజనా కుమారుడు కార్తీక్, కేశినేని చిన్ని కుమారుడు  వెంకట్ బైక్ ర్యాలి లో పాల్గొని యువతను ఉత్సాహపరుస్తు సాగారు.

 ర్యాలీలో యువకులు భారీ ఎత్తున పాల్గొని బీజేపీ జై జై నినాదాలతో సాగారు. ఈ బైక్ ర్యాలి పశ్చిమ నియోజక వర్గం అంతటా సాగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here