మీడియా సమాచారం
పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపిన పి.హరిప్రసాద్
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి పి.హరిప్రసాద్ కృతజ్ఞతలు తెలియచేశారు. గురువారం మధ్యాహ్నం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ ని కలిసి పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “జనసేన పార్టీకి హరిప్రసాద్ అందించిన సేవలు విలువైనవి… నిస్వార్థమైనవి. అంకిత భావంతో పార్టీ కోసం పని చేశారు. మండలిలో ప్రజా సమస్యలు, రాష్ట్ర అభివృద్ధి కోసం బలంగా చర్చించేందుకు అవగాహన హరిప్రసాద్ కి ఉంది. ఆయన మాట్లాడేటప్పుడు భాషలో కంటే భావంలో వాడి వేడి చూపే నైపుణ్యం కచ్చితంగా ప్రజా ప్రయోజనకరమైన చర్చలకు అవకాశం ఇస్తుంది” అన్నారు. పవన్ కళ్యాణ్ తనపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ, నమ్మకాన్ని నిలబెట్టుకొంటానని హరిప్రసాద్ తెలిపారు.