జనసేనాని పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు మరోమారు విమర్శలు గుప్పించారు. పవన్ సినిమా అత్తారింటికి దారేది డైలాగ్ కు పేరడీ వ్యాఖ్యలతో ట్వీట్ చేశారు. ‘ఎక్కడ నెగ్గాలో తెలియదు.. ఎక్కడ తగ్గాలో అస్సలు తెలియదు’ అంటూ అంబటి చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి జనసైనికులు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఇటీవల మంత్రి అంబటి మాట్లాడిన వీడియోతో కామెంట్లు పెడుతున్నారు. సిద్ధం సభలో అంబటి మాట్లాడుతూ.. సీఎం జగన్ మోసగాడంటూ నోరుజారాడు. ఈ వీడియో క్లిప్పింగ్ ను జనసైనికులు వైరల్ గా మార్చేశారు. పవన్ కు ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో బాగా తెలుసంటూ కామెంట్లు పెడుతున్నారు.
![]()

