విజయవాడ, 18 – 07 – 2025
పలు వక్ఫ్ ఆస్తులను పరిశీలించిన అబ్దుల్ అజీజ్.
స్థిరమైన ఆదాయం పెంచే విధంగా అభివృద్ధి కి చర్యలు.
ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ శుక్రవారం పలు వక్ఫ్ ఆస్తులను పరిశీలించారు. ముందుగా విజయవాడ లోని కాలేశ్వరరావు మార్కెట్ వద్ద గల ముసాఫిర్ ఖానా ను పరిశీలించారు. అక్కడి పరిస్థితుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఆదాయం పెరిగే విధంగా తీసుకోవాల్సిన చర్యలను సూచించి తక్షణమే అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గ్రామంలోని 3.21 ఎకరాల వక్ఫ్ భూమిని పరిశీలించారు. ప్రస్తుతం అందులో 1.4 ఎకరాల భూమి ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, స్థానిక ప్రాధాన్యం మరియు భవిష్యత్తు అవకాశాలు దృష్టిలో పెట్టుకొని సదరు భూమి నందు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్ణయించామని, వక్ఫ్ బోర్డ్ కు స్థిరమైన ఆదాయం పెరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వారితో పాటు వక్ఫ్ బోర్డ్ సభ్యులు అక్రమ్, సీఈవో మొహమ్మద్ అలీ, వక్ఫ్ బోర్డ్ అధికారులు, మాజీ కార్పొరేటర్ ఫతాఉల్లా ఉన్నారు.