‘పర్యావరణ పరిరక్షణలో సాంకేతిక సాయం జోడించి…

Spread the love

విజయవాడ,
22.11.2025.
‘పర్యావరణ పరిరక్షణలో సాంకేతిక సాయం జోడించి… పక్కా వ్యవస్థతో పని చేస్తూ చక్కటి ఫలితాలను చవిచూస్తున్నామనీ, ముఖ్యమంత్రి వర్యుల ఆశయసాధనలో ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా విధుల్లో పాలుపంచుకోవడం ఎంతో గర్వంగా ఉందనీ’ అంటున్నారు ఏపీ ఎన్విరాన్ మెంట్ మేనేజ్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎపీఈఎమ్ సీ ఎల్) ఛైర్మన్ పోలంరెడ్డి దినేశ్ రెడ్డి. ఆయన ఏపీఈఎమ్ సీఎల్ ఛైర్మన్ గా బాధ్యతలు తీసుకుని ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా విజయవాడలోని ఏపీఐఐసీ కాలనీలోని కార్యాలయంలో అభినందన కార్యక్రమం జరిగింది. ఆ సందర్భంగా మాట్లాడుతూ ’ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు ఆశీస్సులతో, ఉపముఖ్యమంత్రి-పర్యావరణం, అడవులు, శాస్త్ర సాంకేతిక మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ IT, విద్యా శాఖ మంత్రివర్యులు, శ్రీ లోకేష్ గారి ఆశీస్సులతో AP ENVIRONMENT MANAGEMENT CORPORATION చైర్మన్ గా బాధ్యతలు తీసుకుని సంవత్సరం పూర్తైంది. ఈ కార్పొరేషన్ ద్వారా పారిశ్రామిక వ్యర్ధాలను(Industrial Waste) క్రమ పద్ధతిలో, సక్రమైన రీతిలో పర్యావరణ హితంగా వ్యర్దాలను తరలిచడం, ప్రత్యేక ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా ప్రాసెస్ చేయడం నిత్యం జరుగుతోంది. ఈ మొత్తం వ్యవస్థను పర్యవేక్షించడానికి ప్రత్యేకమైన AP ONLINE WASTE EXCHANGE PORTAL అందుబాటులో ఉంది. ఈ పోర్టల్ తో అనుసంధానమైన జీపీఎస్ ట్రాకర్ ని పారిశ్రామిక వ్యర్దాలు అయిన HAZARDOUS, EFFLUENT(జలవ్యర్దాలు) లను తరలించే వాహనాలకు అమర్చి… డంపింగ్, రీసైక్లింగ్ ప్రక్రియ సమర్థంగా జరుగుతోందో లేదో మానిఫెస్టో సిస్టమ్ ద్వారా పక్కాగా పర్యవేక్షిస్తున్నాం. గతంలో ఈ వ్యర్దాలను తీసుకుని వెళ్లే వాహనాలు నిర్ణీత ప్రదేశాలకు వెళ్లాయో లేదో తెలిసేది కాదు. ఈ కార్పొరేషన్ ఏర్పాటం చేయడం ద్వారా వాహనాలను ట్రాక్ చేస్తూ… డ్రైవర్లు ఆ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చూస్తూ పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది. ఇప్పటి వరకు ఈ Online Portal ద్వరా 1270 Waste Generators, 243 Waste Receivers, 1793 వాహనాలు రిజిస్టర్ కావటం జరిగింది. గత ఆర్ధిక సంవంత్సరంలో 6,49,033 టన్నుల Hazardous waste ను డంపింగ్ యార్డులకీ, రీసైక్లింగ్ కీ, సిమెంట్ పరిశ్రమల్లో ఇంధనగా మార్చడానికి తరలించటం జరిగింది. అలాగే 19,66,201 Kilo litters జలవ్యర్దాలను శుద్ధి యూనిట్లకు తరలించడంలో కీలక పాత్ర పోషించాం. 82,90,349 టన్నుల FLYASHను ఇటుకల పరిశ్రమలకు, సిమెంట్ పరిశ్రమలకు ఈ APEMCL ONLINE PORTAL ద్వారా గమ్యస్థానాలకు చేరవేయడంలో విజయం సాధించాం. పరిశ్రమల్లో విడుదలైన వ్యర్థా జలాలను శుద్ధి చేసి సముద్రంలోకి విడుదల చేసే ప్రక్రియలో ఏపీపీసీబీ అధికారులు వినియోగిస్తున్న ఆన్ లైన్ మానిటరింగ్ వ్యవస్థ లో కీలక పాత్ర పోషిస్తున్న APEMCL marine discharge application ను మా కార్పొరేషన్ సమర్థంగా పర్యవేక్షించడం ఆనందంగా ఉంది. APEMCL చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రభుత్వ ఆదేశాలు పాటించడంతోపాటు ప్రభుత్వం చేపట్టిన Circular Economy Policy ని మా కార్పొరేషన్ అమలు చేయటం జరుగుతోంది. వ్యర్థాల ను వృథాగా డంప్ చేయకుండా రీసైక్లింగ్, సిమెంట్ పరిశ్రమలు ఉపయోగించుకునేలా చూస్తున్నాం. దీని వల్ల ఈ కార్పొరేషన్ చెత్త నుంచి సంపద ను స్రుష్టించే పనిలో కీలకంగా వ్యవహరిస్తోంది. అలాగే భవిష్యత్ లో ఈ కూటమి ప్రభుతంచొరవతో ఏర్పడే నూతన పరిశ్రమలను మా కార్పొరేషన్ లో రిజిస్టర్ చేయించి పర్యావరణ పరిరక్షణ కు మరింత గా కృషి చేస్తాము. పారిశ్రామిక వాడల్లో జలవ్యర్దాలను శుద్ధి చేసే యూనిట్లు, ఘనవ్యర్దాల కోసం డంపింగ్ యూనిట్లను నెలకొల్పడానికి ఏర్పాట్లు చేస్తున్నాం’ అని అన్నారు దినేశ్ రెడ్డి.

Loading