ప‌ర్యాట‌కుల సౌల‌భ్యం కోసం సీఎం చంద్ర‌బాబు కు ప‌లు సూచ‌న‌లు చేసిన ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

3
0

27-06-2025

ప‌ర్యాట‌కుల సౌల‌భ్యం కోసం సీఎం చంద్ర‌బాబు కు ప‌లు సూచ‌న‌లు చేసిన ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

జీఎఫ్ఎస్టీ టూరిజం కాన్ క్లేవ్ లో భాగంగా పర్యాటక క్వారవాన్లు ప్రారంభం

జెండా ఊపి ప్రారంభించిన సీఎం చంద్ర‌బాబు, యోగా గురువు రాందేవా బాబు

సీఎం, బాబాల‌తోపాటు వాహ‌నాల‌ను ప‌రిశీలించిన మంత్రి దుర్గేష్, ఎంపీ కేశినేని, ఎమ్మెల్యేలు గ‌ద్దె, కొలిక‌పూడి

*సీఎం చంద్ర‌బాబు, యోగా గురువు రాందేవా బాబు స్వాగ‌తం ప‌లికిన ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

విజ‌య‌వాడ : మ‌రో రెండేళ్ల‌లో రాబోయే కృష్ణ పుష్క‌రాల స‌మ‌యానికి కుంభ‌మేళాలో ఏర్పాటు చేసిన‌ట్లు టెంట్ కాటేజ్, అలాగే విదేశాల్లో వుండే ఆర్.వి. వెహిక‌ల్స్, క్వారవాన్ పర్యాటక వాహనాలను అందుబాటులోకి తీసుకువ‌స్తే యాత్రికుల‌కు చాలా సౌల‌భ్యంగా వుంటుంద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడికి ఎంపీ కేశినేని శివ‌నాథ్ సూచించారు.

విజ‌యవాడ‌లో ముర‌ళీ ఫార్చ్యూన్ లో ఏర్పాటు చేసిన జీఎఫ్ఎస్టీ టూరిజం కాంక్లేవ్ లో పాల్గొనేందుకు ముఖ్యఅతిథులు విచ్చేసిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, యోగా గురువు రాం దేవ్ బాబా కు , మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే లు గద్దె రామ్మోహన్, కొలికపూడి శ్రీనివాసరావు ల‌తో క‌లిసి ఎంపీ కేశినేని శివ‌నాథ్ స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన ఆంద్ర‌ప్ర‌దేశ్ క్యార‌వాన్ టూరిజం వాహ‌నాల‌ను రాందేవ్ బాబా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తో క‌లిసి ఎంపీ కేశినేని శివ‌నాథ్, మంత్రి దుర్గేష్‌, ఎమ్మెల్యేలు గ‌ద్దె రామ్మోహన్ ప‌రిశీలించారు. అనంతరం రాందేవ్ బాబా తో క‌లిసి ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ప‌ర్యాట‌క క్యార‌వాన్లను జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో ఎంపీ కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ గండికోట లాంటి ప‌ర్యాట‌క ప్రాంతాల్లో ఆర్.వి వెహిక‌ల్స్ పార్కింగ్ డెవ‌ల‌ప్ చేయాల‌ని సూచించారు. అదే విధంగా ప‌ర్యాట‌క ప్రాంతాల్లో టెంట్ కాటేజ్, ఆర్.వి. వెహిక‌ల్స్, క్వారవాన్ పర్యాటక వాహనాలను అందుబాటులోకి తీసుకువ‌స్తే బాగుంటుంద‌న్నారు. ఎంపీ కేశినేని శివ‌నాథ్ చేసిన సూచ‌న‌ల‌పై ముఖ్య‌మంత్రి సానుకూలంగా స్పందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here